Monday, December 23, 2024

జాతీయ జెండాలను ఇంటింటికీ పంపిణీ చేసిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

minister harish distributed national flags in siddipet

సిద్దిపేట: స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో ఇంటింటికీ జాతీయ జెండా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మెన్ రోజా రమణి శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ చైర్మెన్ ఒంటేరు ప్రతాప రెడ్డి, గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి స్వయంగా ఇంటింటికీ తిరిగి జెండా విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ జెండాను ఆగస్టు 15న ఇంటిపై ఎగరేయాలని, ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News