Wednesday, January 8, 2025

65 లక్షల మందికి ‘మీటర్ల ఉరి’

- Advertisement -
- Advertisement -

బాయిలకాడ మీటర్లు పెట్టనందుకు రెండేళ్లలో రూ.12వేల కోట్లను ఆపిన కేంద్రం
చేనేతపై జిఎస్‌టిని 2017లోనే అడ్డుకున్నాం మీ పార్టీలో చేరిన ఆనాటి
ఆర్థిక మంత్రిని అడిగితే వాస్తవాలు తెలుస్తాయి బిజెపి నేతలపై మంత్రి హరీశ్ ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి అంటే కూలిపోయే బ్రిడ్జిలు.. ప్రజ ల ప్రాణాలు నీళ్లపాలు అని రాష్ట్ర ఆ ర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు ఆరోపించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల డబ్బుతో నీళ్లు లిఫ్ట్ చేస్తుంటే.. కాషాయ పార్టీ మా త్రం అక్రమంగా సంపాదించిన డ బ్బులతో శాసనసభ్యులను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తోందని ఆయన ఎద్దే వా చేశారు. బెంగాల్లో బ్రిడ్జి కూలిపో తే అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టమని దేవుడు సిగ్నల్ ఇచ్చాడని అన్న ప్ర ధాని మోడీ.. గుజరాత్‌లో కూడా తీగల వంతెన పడిపోయిందన్నారు. మరి మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని దేవుడు సిగ్నల్ ఇచ్చాడనుకోవాలా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు వ్యవహారంలో స్వామిజీ లు ఎవరో తమకు తెలియదని పే ర్కొంటున్న బిజెపి నాయకులు మరి కేసులు ఎందుకు వేశారని ప్రశ్నించా రు. సోమవారం తెలంగాణ భవన్ లో కాలేరు వెంకటేశ్, శా సనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, దేవి ప్రసాద్, దాసోజు శ్రవణ్, మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, బిజెపి నాయకులు దిక్కుమాలిన, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌లవి పూర్తగా నకిలీ మాటలు, వెకిలి చేష్టలని విమర్శించారు. వాళ్లు మాట్లాడే మాటలు గల్లీ రాజకీయ నాయకులు కూడా మాట్లాడరన్నారు. నోటికొచ్చినట్లు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దిక్కుమాలిన, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అబద్ధాలు చెప్పడం ఆ పార్టీ డిఎన్‌ఎగా మరిందన్నారు. ఒక పద్దతి..పాడు లేకుం డా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కొనసాగుతున్న కెసిఆర్‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతుండడంపై ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. మునుగోడులో రీసర్చ్ సెంటర్, వంద పడకల దవాఖాన హామీని బిజెపి విస్మరించిందన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక మునుగోడులో నడ్డా సభ రద్దు చేసుకున్నారన్నారు. ఇడి, సిబిఐలను కేం ద్రం జేబు సంస్థగా మార్చుకుందని హరీశ్‌రావు మరోసారి ఆరోపించారు. కేంద్ర మంత్రికిషన్ రెడ్డి, బండి సంజయ్ స్థాయి ఏమిటో ఢిల్లీ దూతలే చెప్పారన్నారు.

చరిత్ర సృష్టించే విధంగా జరిగిన బహిరంగ సభ

మునుగోడు నియోజకవర్గంలో చరిత్ర సృష్టించే విధంగా సభ నిర్వహించామని హరీశ్‌రావు అన్నారు. ఈ సభకు హాజరైన అశేష జనవాహిని సిఎం కెసిఆర్ పట్ల ఉన్న ప్రజాభిమానాన్ని చాటిచెప్పిందన్నారు. మునుగోడులో టిఆర్‌ఎస్ గెలుపు ముమ్మాటికీ ఖాయమైందన్నారు. మునుగోడులో దశాబ్దాల ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత కెసిఆర్‌దేనని వెల్లడించారు. చండూరులో ఆదివారం నిర్వహించిన సభతో బిజెపి నాయకులకు కంటిమీద కునుకులేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజలకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వల్ల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాయన్నారు. బిజెపికి ఏం చేసిందో చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. మోడీ హయంలో గ్యాస్, పెట్రోల్ ధరలు మాత్రం విపరీతంగా పెంచిందన్నారు. ఈ స్థాయిలో ధరలను పెంచిన ఘనత బిజెపిదేనని విమర్శించారు. బిజెపి అంటే పెంచుడు.. టిఆర్‌ఎస్ అంటే పంచుడన్నారు.

దయ్యాలు వేదాలు వల్లించినట్టే

పార్టీలో చేరికల గురించి బిజెపి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టేనని ఎద్దేవా చేశారు. వందల కోట్లు ఆశ చూపి టిఆర్‌ఎస్ శాసనసభ్యులను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా బిజెపి ఎత్తుగడలను తమ పార్టీ శాసనసభ్యులు తిప్పికొట్టారన్నారు. మీరు (బిజెపి) విలీనం చేసుకోవచ్చుకానీ…. తాము అదేపని చేస్తే తప్పా? అని హరీశ్‌రావు నిలదీశారు. 8 రాష్ట్రాల్లో దొడ్డిదారిన ప్రభుత్వాలను కూల్చింది నిజం కాదా? అని ఆయన నిలదీశారు. రాజ్యాంగ నిబంధనల మేరకు కాంగ్రెస్ వాళ్లు టిఆర్‌ఎస్‌లో విలీనమయ్యారే తప్ప మీలా ప్రభుత్వాలను కూలగొట్ట లేదన్నారు. మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదారులు తొక్కుతున్నారని హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇడీలను, బోడీలను చూపించి బెదిరింది ప్రలోభాలకు గురి చేసి బిజెపిలో చేర్చుకుంటారు…. ప్రభుత్వాలు పడగొడ్తరని మండిపడ్డారు.

ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీకు (కిషన్‌రెడ్డి) తెలియదా? టిడిపి నుంచి వచ్చిన సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ లను మీరు విలీనం చేసుకున్నరు కదా? అని నిలదీశారు. మరి కాంగ్రెస్ శాసనసభ్యులు టిఆర్‌ఎస్‌లో విలీనం అయితే తప్పేంటి? ప్రశ్నించారు. రఘురామ కృష్ణం రాజుపై వైఎస్‌ఆర్ సిపి ఫిర్యాదుపై ఎందుకు నిర్లయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి ఎందుకు చర్యలు లేవన్నారు. దమ్ముంటే దీనికి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. మొన్న గుజరాత్ లో 8 మంది శాసనసభ్యులు, సిక్కింలో 13 మంది శాసనసభ్యులను బిజెపిలో చేర్చుకోలేదా? అని హరీశ్‌రావు అడిగారు. కర్నాటక, మధ్యప్రదేశ్, గోవా, సిక్కిం…. ఇలా 8 రాషా ్ర్టల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గద్దెనెక్కిన ప్రభుత్వాలను కూలగొట్టిన మీరు రాజకీయాల కోసం మాట్లాడతారా?మీకు అడిగే నైతిక హక్కు ఉందా? అని ప్రశ్నించారు.

రూ. ౩౦వేల కోట్లను వదులుకున్న ప్రభుత్వం

మోటర్లకు మీటర్లు పెడితే రూ.30 వేల కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వంలో ఆశ చూపిందని మంత్రి హరీశ్‌రావు వివరించారు.. మీటర్లు పెడితే తక్షణమే రూ.6 వేల కోట్లు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలంగాణ ఆర్థిక శాఖకు లేఖ రాసిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో రెండేళ్లలో కలిపి కేంద్రం రూ రూ.12 వేల కోట్లను ఆపిందన్నారు. పాయింట్- 5 ఎఫ్‌ఆర్‌బిఎమ్ నిధులు ఇవ్వాలంటే మోటార్లకు మీటర్లు పెట్టాలని షరతు పెట్టారన్నారు. మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడు పెట్టే కుట్ర బిజెపి చేస్తోందని ఆరోపించారు. అయితే గొంతులో ప్రాణం ఉన్నంతవరకు మీటర్లు పెట్టబోమని కేంద్రానికి సిఎం కెసిఆర్ ఖరాఖండిగా చెప్పారన్నారు. మోటర్లకు మీటర్ల పేరుతో రైతు మెడలో ఉరితాడు బిగించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది 65 లక్షల మంది రైతుల జీవితాలతో ముడిపడిన అంశమన్నారు.

జిఎస్‌టిపై కిషన్‌రెడ్డివి పచ్చి అబద్ధాలు

చేనేతపై జిఎస్‌టిని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని హరీశ్‌రావు విమర్శించారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. జిఎస్‌టికి ఒప్పుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. చేనేతపై జిఎస్‌టిని మినహాయించాలని 2017లోనే రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. అప్పటి ఆర్థిక మంత్రిని అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో పచ్చి అసత్యాలు చెబుతున్న బిజెపి నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫ్లోరైడ్ కోసం రూ.800 కోట్లు ఇచ్చామని కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని హరీశ్‌రావు విమర్శించారు. మిషన్ భగీరథకు రూ.19,200 కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫార్సు చేసిందన్నారు. రూ.19 వేల కోట్లు కాదుకదా…. రూ.19 కూడా ఇవ్వలేదన్నారు. 15వ ఆర్థిక సంఘం మిషన్ భగీరథకు రూ.2,350 కోట్లు ఇవ్వాలని చెప్పిందన్నారు. మరి ఆ నిధుల సంగతి ఏమిటో కిషన్ రెడ్డి మాట్లాడాలన్నారు. నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం తుంగలో తొక్కుతుందని మండిపడ్డారు. కృష్ణా జలాల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం 20 ఉత్తరాలు రాసిందన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా కేంద్రం అన్యాయం చేస్తున్నదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News