Thursday, November 21, 2024

సిద్దిపేటలో డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish inaugurates diagnostic center in Siddipet

సిద్ధిపేట: సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్ ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా శర్మ తదితరులు పాల్గొన్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్ లోని వైద్య పరికరాలు, 57 రకాల వైద్యపరీక్షల గురించి వైద్యులు మంత్రి హరీశ్ రావుకు  వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. హైదరాబాద్ తరువాత సిద్ధిపేటలో డయాగ్నోస్టిక్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సిద్ధిపేట ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వైద్యరంగంలో సిఎం కెసిఆర్ గొప్పమార్చు తీసుకోచ్చారని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులకు అనుబంధంగా డయాలసిస్ సెంటర్లు ప్రారంభించామన్నారు. కెసిఆర్ కిట్ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులపట్ల ప్రజలల్లో విశ్వాసం పెరిగిందని మంత్రి స్పష్టం చేశారు.

Minister Harish inaugurates diagnostic center in Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News