Friday, November 22, 2024

రేడియాలజీ హబ్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish inaugurates radiology hub in Siddipet

సిద్దిపేట : జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రేడియాలజీ హబ్ ను జెడ్పీ చైర్మన్ రోజా శర్మతో కలిసి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు పెంచే కార్యక్రమంలో భాగంగా సిఎం కెసిఆర్ ఆలోచన మేరకు ప్రతి జిల్లా ఆసుపత్రులలో టీ డయాగ్నోస్టిక్ హబ్, రేడియాలజీ హబ్ ప్రారంభిస్తున్నామన్నారు. ప్రతి పీహెచ్ సీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వచ్చే వారికి 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తాం. రక్త పరీక్షలు, వివిధ రకాల పరీక్షలు ఉండేవి. పీహెచ్ సీలకు వచ్చే రోగులకు కొంతమందికి గుండెనొప్పితో వస్తే ఈసీజీ, 2డీ ఈకో, ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, మెమెగ్రఫీ సేవలు అవసరాలకు అనుగుణంగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని 33 జిల్లాలో 33 రేడియాలజీ ల్యాబ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నాం. అన్నీ రకాల వైద్య పరీక్షలు పేదలకు అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండేలా తెస్తున్నామని మంత్రి హీరశ్ పేర్కొన్నారు.

హైదరాబాద్ జంట నగరాలలో అదనంగా 10 రేడియాలజీ ల్యాబ్ లు ప్రారంభిస్తున్నాం. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు కోసం వెళితే ప్రైవేట్ ల్యాబ్ లకు రాసేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు అండగా ఉంటున్నది. ప్రజలు ప్రయివేటు ఆసుపత్రికి, ప్రయివేటు స్కానింగ్ సెంటర్లకు వెళ్లొద్దన్నారు. ఏ వైద్య పరీక్ష కావాలన్నా.. ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు చేస్తారని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లా ఆసుపత్రిలో ఏర్పాట్లు చేస్తున్న దృష్ట్యా ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీల సంఖ్య పెరగాలి. అన్నీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో స్టెమీ కార్యక్రమం ద్వారా 40 వేల రూపాయల విలువ కలిగిన ఇంజక్షన్ ఇస్తూ.. గుండెపోటు రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. అన్నీ జిల్లాలో స్టెమీ కార్యక్రమం ప్రభుత్వం తీసుకొచ్చింది. 70 ఏళ్లలో కేవలం 3 కళాశాలలు వస్తే.. ఇవాళ 7 ఏళ్లలో 33 మెడికల్ కళాశాలలు తెచ్చుకున్నామన్నారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో 33జిల్లాలో 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలోని 8 చోట్ల మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లు ప్రారంభం చేయనున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం 700 మెడికల్ కళాశాల సీట్లు ఉండేవి. 7 ఏండ్లలో 2840 మెడికల్ కళాశాల సీట్లు పెరిగాయి. రాబోయే రెండేళ్లలో 5240 మెడికల్ సీట్లు పెంపు జరగనున్నది. దేశంలోనే ప్రతీ జిల్లాలో మెడికల్ కళాశాల పెట్టిన ఏకైక రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ కనక రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం,సుడా డైరెక్టర్ మచ్చవేణుగోపాల్, డీఏంహెచ్ఓ కాశీనాథ్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News