షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు బుధవారం పర్యటించారు. నియోజక వర్గంలోని కేశంపేట మండలం, అల్వల, కొత్తపేట గ్రామాల్లో రైతు వేదికను మంత్రి హరీశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మేల్యేలు అంజయ్య యాదవ్, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, జడ్పీ చైర్మన్ తీగల అనితా రెడ్డితో పాటు పలువురు టిఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ…. బిజెపి ఎందుకోసం యాత్రలు చేస్తున్నది. సిగ్గు లేకుండా బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. ఏమి సాధించారని పాదయాత్ర చేస్తున్నారు. ఏం చెప్పాలని పాదయాత్ర చేస్తున్నారు. మోడీ నిర్ణయాలు పేదల ఉసురు తీస్తున్నాయి. రూ. 2.50 లక్షల కోట్ల సబ్సిడీ బకాయిలు కేంద్రం ఉందన్నారు. ఎప్పుడు వచ్చేలా చేస్తావ్ బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. పేదల కోసం రైతు బీమా, రైతు బంధు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.