Wednesday, January 22, 2025

పేదలకు మంచి వైద్యం అందించాలి: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish of Hugo Robotic Assisted System in Care Hospital

హైదరాబాద్: బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో హ్యూగో రోబోటిక్స్ అసిస్టెడ్ సిస్టంను మంత్రి హరీశ్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరం ఎంతో అవసరమన్నారు. తద్వారా రికవరీ పెరుగుతుంది. పేషెంట్ ఆసుపత్రిలో ఉండే సమయం తగ్గి, వారికి బిల్ తగ్గుతుందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. బెస్ట్ ట్రీట్మెంట్ తో పాటు, అఫర్డబుల్ ట్రీట్మెంట్ అందించాలన్నారు. చికిత్స కోసం ఎంతోమంది హైదారాబాద్ వస్తున్నారు. మెడికల్ టూరిజం ఎంతో అభివృద్ధి చెందిందని హరీశ్ రావు వివరించారు. సిఎం కెసిఆర్ చేస్తున్న, కల్పిస్తున్న అవకాశాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం మూడు టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నదన్నారు. కేర్ ఆసుపత్రిలో కూడా ఆరోగ్య కేసులు బాగా తీసుకోవాలని కోరుతున్నాని మంత్రి తెలిపారు.

ఏడాదికి 1000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న మంత్రి మీరు కూడా పేదలకు మంచి వైద్యం అందించాలి సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలంగాణ ఐటీ ఉద్యోగులు ఉంటారు. మెడికల్ లో కూడా అలాగే చేస్తున్నాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభిస్తున్నాము. 233 పీజీ సీట్లు యాడ్ చేస్తున్నాం. నాడు యూజీ సీట్లు 800 సీట్లు ఉంటే 2840కు పెంచామని ఆయన సూచించారు. ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ బలోపేతం చేస్తున్నామన్నారు. 11,440 కోట్లు హెల్త్ కోసం బడ్జెట్ పెట్టుకున్నాం. ఐటీలో మనం ఎలాగ మేటిగా ఉన్నామో.. వైద్యంలో కూడా అవుతామని చెప్పారు. తెలంగాణలో సాధారణ డెలివరీలు పెరగాలి. సర్జరీలు తగ్గాలన్నారు. ఆడిట్ చేస్తున్నాం. ప్రైవేట్ లో కూడా చాలా తగ్గాలని ఆదేశించారు. అవసరం ఉన్న పరీక్షలు మాత్రమే చేయాలి. కార్పొరేట్ ఆసుపత్రుల మీద కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఉంటుంది. అది ఉండకూడదని మంత్రి హరీశ్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News