సంగారెడ్డి: జిల్లాలోని కంది గ్రామంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్, రాధాకృష్ణ టెంపుల్ కి ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… హరే కృష్ణ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు కోసం ఈరోజు శంకుస్థాపన, భూమిపూజ చేయడం సంతోషంగా ఉంది. ప్రాచీన సనాతన వారసత్వాన్ని, మన సంస్కృతిని ప్రోత్సహించి ఆధ్యాత్మికతను పంచే ఒక గొప్ప కేంద్రంగా ఇది విరాజిల్లుతుందని మంత్రి ఆకాంక్షిస్తున్నాను. ప్రశాంత మైన జీవనం గడపాలంటే ఆధ్యాత్మికత ఎంతో అవసరమన్నారు. భక్తీ, శ్రద్ధలతో ఉండటం వల్ల అనుకున్న పనులను మరింత బలంతో చేయగలమని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.
హరే కృష్ణ ఫౌండేషన్ అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నది. భోజనామృతం, అన్నపూర్ణ, సద్దిమూట… ఇలా పేరు ఏదైనా, ప్రభుత్వం, హరే రామ కలిసి ప్రతి రోజు 65,000 మందికి భోజనం అందిస్తున్నామనిప పేర్కొన్నారు. గడిచిన 10 ఏళ్లలో లక్షల మంది ఆకలి తీర్చడం జరిగిందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు 5 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని చారిత్రక ఉస్మానియా ఆసుపత్రి వేదికగా ప్రారంభించుకున్నమని, ఏ చట్టాలు, పోలీసులు, ప్రభుత్వాలు చేయలేని పని భగవంతుడు చేస్తాడని ఆయన తెలిపారు. మనల్ని మంచి మార్గంలో నడిపే శక్తి భగవంతుడికే ఉంది. కల్చరల్ సెంటర్ కి ఏమైనా సహాయం కావాలంటే తన వ్యక్తిగతంగా సహాయం చేసే అవకాశం ఇవ్వండని మంత్రి కోరారు.