హైదరాబాద్: తెలంగాణలో బుధవారం రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ”ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రాణ భయం లేదు. జాగ్రత్తగా ఉంటూ అందరూ మాస్కులు ధరించాలి. సామాజిక కార్యక్రమాలను దూరంగా ఉండటం మంచిది. రాష్ట్రంలో ఒమిక్రాన్ పరీక్షలు పెంచాలని అధికారులను అదేశాలు ఇచ్చాం. రాష్ట్రంలో ఆంక్షలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రతీరోజు పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వానికి సహకరించి ప్రజలందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి.రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటి డోస్ వ్యాక్సినేషన్ 97శాతం పూర్తైందని.. రెండో డోస్ వ్యాక్సినేషన్ 54శాతం పూర్తైంది.బూస్టర్ డోస్ పై కేంద్రాన్ని కోరాం. ముందస్తుగా 21లక్షల ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేశాం” అని వివరించారు.
Minister Harish Rao About Omicron Variant