Monday, December 23, 2024

ఇది సిఎం కెసిఆర్ పట్టుదలకు నిదర్శనం : మంత్రి హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారి.. ఇది సిఎం కెసిఆర్ పట్టుదలకు నిదర్శనం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్ర చరిత్రలో సుదినం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలని సిఎం కెసిఆర్ మార్గనిర్దేశంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించామని చెప్పారు.

గత సంవత్సరం 8 కాలేజీలు ప్రారంభించి తెలంగాణ కొత్త రికార్డు సృష్టించిందని, ఈ సంవత్సరం మన రికార్డును మనమే అధిగమించామని పేర్కొన్నారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబిబిఎస్ సీట్లలో తెలంగాణ వాటా 43 శాతం అని, ఇది గొప్ప రికార్డు అని తెలిపారు. దేశంలోని మిగితా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 57 శాతం సీట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News