Monday, December 23, 2024

సంపద పెంచు.. పేదలకు పంచు.. అనేది కెసిఆర్ నినాదం: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish rao Addressing public gathering in Siddipet

సిద్దిపేట: సిద్దిపేట ఉన్నత పాఠశాలలో శుక్రవారం సమైక్యతా వజ్రోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ బహిరంగసభలో రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, కలెక్టర్, సిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ… ఈ గడ్డ ఎప్పటికప్పుడు పెంత్తందారులను తిప్పికొట్టిందన్నారు. కులమతాల మధ్య చిచ్చుతో రాజకీయ లబ్ధికి కొందరు ప్రయత్నింస్తున్నారని మండిపడ్డారు. మత విద్వేషాలు.. రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు. సంపద పెంచు.. పేదలకు పంచు.. అనేది కెసిఆర్ నినాదం అని మంత్రి పేర్కొన్నారు. నవతెలంగాణ నిర్మాణం కోసం మనం ముందుకెళ్లాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకుంటోందని తెలిపారు. 8 ఏళ్లలో దక్షిణభారత ధాన్యగారంగా తెలంగాణ మారిందని మంత్రి పేర్కొన్నారు. అటు తెలంగాణ వ్యాప్తంగా సమైక్యతా వజ్రోత్సవ ర్యాలీలను నిర్వహిస్తున్న ముచ్చట తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News