Sunday, January 26, 2025

చేతనైతే పోరాడండి..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : సోమవారం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని మిట్టపల్లి గ్రామంలో జరిగిన బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడాతూ.. 9 ఏండ్ల పాలనలో భూతద్దంతో వెతికిన కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ చేసిన ఏ ఒక్క మంచి పని దొరకదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి సర్కార్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నా ఉద్యోగాలను కూడా ఊడగొట్టిందన్నారు. ప్రజల దగ్గర దోచుకొని అదాని లాంటి బడా బాబులకు పంచుడు పనిగా పెట్టుకుందన్నారు. కెసిఆర్ అనే అద్భుత ద్వీపం తెలంగాణలో ఉండడంతోనే ఈ రాష్ట్రం అభివృద్ధ్దిలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి తెరిచిన పుస్తకం లాంటిదని ప్రతి ఒక్కరు ఎప్పుడైనా చూసుకోవచ్చు అన్నారు. తెలంగాణలో నాటి, నేటి పరిస్థ్ధితులు జమీన్ ఆస్మాన్ పరక్‌గా ఉన్నాయన్నారు.

సిఎం కెసిఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతోనే తెలంగాణలో భూముల ధరలు అత్యధికంగా పెరిగిపోయాయన్నారు. అదే కాంగ్రెస్ హయాంలో భూముల ధరలు చాలా తక్కువగా ఉండేవి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంతోనే ఎటు చూసినా పచ్చని పంట పోలాలే దర్శనమిస్తున్నాయన్నారు. మండు టెండల్లో మత్తళ్లు దుంకడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఇదంతా కెసిఆర్‌తోనే సాధ్యమైంది అన్నారు. పిచ్చికూతలు కూస్తున్న బిజెపి కాంగ్రెస్ వాళ్లకు ప్రజలు తగిన రీతిలో బుద్ధ్ది చెప్పాలన్నారు. చివరి శ్వాస వరకు సిద్దిపేట ప్రజల కోసమే పని చేస్తానన్నారు. ఆంధ్ర ప్రజల పక్షాన మాట్లాడిన తనపై ఆంధ్ర నాయకులు ఎగిరెగిరి పడడం సరికాదని అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కుపై పోరాటం చేయాలని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆంధ్ర నాయకులకు సూచించారు.

తాను ఆంధ్ర రాష్ట్రాన్ని అక్కడి ప్రజలను కించపరిచిన అని కొంత మంది నాయకులు అనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్ననన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణలో బాగుంటే మంచిగా బతకాలి అనడం తప్పేమిటి అని ప్రశ్నించారు. పొలవరం ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు తరహా సాగునీరు అందించాలని సూచించారు. తెలంగాణలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న విధంగా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా అందిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధ్దిలో చెమట చుక్క కార్చిన ప్రతి ఒక్కరు తమ బిడ్డలేనని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News