Thursday, January 23, 2025

వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు అభినందనలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాతా శిశు సంరక్షణలో రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలకు కేంద్ర ప్రభుత్వం నుండి రెండు అవార్డులు వచ్చిన సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కోకాపేటలోని మంత్రి నివాసంలో గురువారం మెటర్నల్ హెల్త్ జెడి డాక్టర్ పద్మజ, ఇతర అధికారులు హరీశ్‌రావును కలిసి రాష్ట్రం తరపున అందుకున్న అవార్డులను మంత్రికి అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమం జరిగిన తీరును, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాల గురించి అధికారులు మంత్రితో చర్చించారు. తెలంగాణ రాష్ట్రానికి మిడ్ వైఫరీకి ప్రత్యేక గుర్తింపు రాగా, హై రిస్క్ కేసుల గుర్తింపులో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News