Wednesday, January 22, 2025

మంత్రి హరీశ్‌రావు బతుకమ్మ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజలకు, ఆడపడుచులకు మంత్రి హరీశ్‌ రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజులపాటు జరుపుకునే పండుగ బతుకమ్మ అన్నారు. ఎంగిలి పూల బతుకమ్మ తో తొమ్మిది రోజుల పాటు తిరొక్క రంగుల తో అడపడుచులు జరుపుకొని బతుకమ్మ పండగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఔన్నత్యానికి ప్రతీకను చాటి చెప్పారని సద్దుల బతుకమ్మ (పెద్ద బతుకమ్మ )పండగ ను వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

‘తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నన్నారు . దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తు.. ప్రతి ఏటా అడపడుచులకి బతుకమ్మ చీరలను కానుకగా అందిస్తున్నామన్నారు… ఒక నాడు బతుకమ్మ పండగ వచ్చింది అంటే చెరువు ల్లో.. వాగుల్లో నీళ్లు లేని సమయం లో ట్యాంకర్లు పెట్టి నీళ్లు నింపి బతుకమ్మలు వేసే పరిస్థితిని గుర్తు చేశారు.. కాని నేడు కాళేశ్వరం గోదావరి జలాలతో ప్రతి చెరువు లో నీళ్లు కళకళ లాడుతున్నాయన్నారు. ప్రతి చెరువు వద్ద బతుకమ్మ మెట్లు ఏర్పాటు చేసామన్నారు.. మన పండగ మన సంస్కృతి ని చాటే చెప్పే పండగ ను గొప్పగా కుటుంబ సమేతంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News