Wednesday, January 22, 2025

నిర్మలా సీతారామన్‌కు మంత్రి హరీశ్ సవాల్

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Challenge To Nirmala Sitharaman

మెదక్ : కేంద్రం మంత్రి నిర్మలాసీతారామన్ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రధాని ఫోటో రేషన్ షాపులో పెట్టమని చెప్పడం హస్యాస్పదమన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణ చేరలేదంటే తాను రాజీనామాకు సిద్దమన్నారు. ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరి ఉంటే మీరు రాజీనామా చేస్తరా..? అని నిర్మలాసీతారామన్ కు సవాల్ విసిరారు. కేంద్ర మంత్రులది పార్లమెంట్ లో ఓ మాట… గల్లీలో ఓమాట ఉంటుదన్నారు. ఇది ప్రధాని స్థాయిని దిగజార్చే విధంగా ఉందన్నారు. ఎంతో మంది ప్రధానులు వచ్చారు. రేషన్ షాపులో ఫోటోలు పెట్టలేదు. గత చరిత్రలో లేని విధంగా తమ స్థాయిని దిగజార్చుకునే విధంగా కేంద్ర మంత్రులు ప్రవర్తిస్తున్నారని మంత్రి హరీశ్ విమర్శించారు. మొత్తం రేషన్ బియ్యం వాళ్లు ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నరు. రాష్ట్రంలో మీరు ఇచ్చేది 55 శాతం మాత్రమే. అది మూడు రూపాయలకు ఇస్తరు. అందులో రెండు రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 45 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి లబ్ధిదారుడికి పది కేజీల బియ్యం ఇస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 3610 కోట్లు రేషన్ బియ్యం కోసం ఖర్చు చేస్తున్నం. అలా అని సిఎం కెసిఆర్ ఫోటో పెట్టామంటారా ? అని మంత్రి హరీశ్ ప్రశ్నించారు.

దేశాన్ని సాధే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని సీఎం చెబుతారు. చాలా రాష్ట్రాలు పేద రాష్ట్రాలు. తెలంగాణ నుండి దాదాపు లక్షా 70 వేల కోట్లు అదనంగా ఇచ్చినం. తెలంగాణ నుంచి పోయిన డబ్బులు ఇతర రాష్ట్రాలకు, కేంద్రానికి వెళుతుంది. మరి కేసీఆర్ ఫోటో పెడతారా అని ప్రశ్నించారు. 3 లక్షల 65 వేల 797 కోట్లు కేంద్రానికి పోయింది. కాని కేంద్రం నుండి రాష్ట్రానిక వచ్చింది 1 లక్షా 96 వేల 400 కోట్లు మాత్రమే వచ్చింది. కేంద్రంకు రాష్ట్రం నుంచి పోయింది ఎక్కువ. రాష్ట్రానికి వచ్చింది తక్కువ. దేశాన్ని, ఇతర రాష్ట్రాల ను సాధడంలో తెలంగాణ ప్రజల సంపద, తెలంగాణ ప్రభుత్వ వాటా ఉంది. మరి తెలంగాణ ప్రతినిధిగా సీఎం కేసీఆర్ ఫోటో పెడతారా.. మీరు మాట్లాడేది అర్థ సత్యాలు…. మేం మాట్లాడేది నగ్న సత్యాలన్నారు. ఈ మధ్య కేంద్రం నుంచి వస్తోన్న మంత్రులు అబద్దాలు మాట్లాడుతున్నారు. నోరువిప్పితే అబద్ధాలే. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం పారలేదు. అంటరు. మెదక్ జిల్లాలో ఎన్ని ఎకరాలు పారుతోందో మీకు తెలియదా.. కాళేశ్వరంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అయింది. మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాళేశ్వరం తెలంగాణ గ్రోత్ ఇంజన్ అని అంటరు.. మేమే అనుమతులు ఇచ్చినం అటరు. ఒక్క ఎకరా పారలేదని అమిత్ షా మాట్లాడతరు. ఇన్ని పచ్చి అబద్దాలేనని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News