Monday, November 18, 2024

ఆ నాయకులకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందన్నారు.. ప్రతి రోజూ కర్ఫ్యూ ఉంటుందన్నారు. పరిపాలన చేత కాదు.. విద్యుత్ ఉండదన్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ నేడు దేశానికే దిక్సూచిగా నిలుస్తోందని మంత్రి వెల్లడించారు. ఎపి నాయకులకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువని హరీశ్ రావు విమర్శించారు. పాలకుల తీరు వల్ల ఎపి రాష్ట్రం వెల్లకిలా పడిందన్నారు. తెలంగాణ అభివృద్ధి తెలియాలంటే పక్క రాష్ట్రం వెళ్లి చూడాలని మంత్రి హరీశ్ సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.1.30 లక్షల కోట్లను కేంద్రం అడ్డుకుందని ఆయన మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News