హైదరాబాద్: మునుగోడు ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గతంలోనే మునుగోడు ప్రజలను మోసం చేశారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం టిఆర్ఎస్ ఎన్నో పథకాలు తెచ్చిందని ఆయన తెలిపారు. క్షుద్రపూజలంటూ బిజెపి నేతలు మాట్లాడటం దారుణమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చామని మంత్రి గుర్తుచేశారు. తాంత్రిక విద్యలపై కోర్సులు పెట్టింది బిజెపినే అని హరీశ్ అరోపించారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే బిజెపి ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు బిజెపి ఏం చేసిందో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. మతం పేరుతో అధికారంలోకి వచ్చే రాజకీయం బీజేపీ ది. భూతవైద్యం కోర్సు నేర్చుకోవాలని యూపీలో ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మంత్రతంత్రాలు, మతకల్లోలాలు బీజేపీ కి తెలిసినంత ఎవ్వరికీ తెలియవన్నారు. బండి సంజయ్ యూపీకి వెళ్లి భూతవైద్యం కోర్సు నేర్చుకుంటే బెటర్ అన్నారు. తెలంగాణ పథకాలు బాగున్నాయి కాబట్టే…కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం దేశంలో పేర్లు మార్చి అమలు చేస్తోంది నిజం కాదా? అని మంత్రి హరీశ్ ప్రశ్నించారు.
Live: Addressing the media at TRSLP https://t.co/mrRnn04VGC
— Harish Rao Thanneeru (@trsharish) October 9, 2022