Monday, December 23, 2024

తెలంగాణ పథకాలను కేంద్రం అమలు చేయాలి: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

minister harish rao comments on central govt

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుపథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. దేశంలోని రైతులందరికీ తెలంగాణ పథకాలు అమలు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. రూ.5 లక్షల రైతుబీమా దేశమంతా అమలు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణలో ఇస్తున్నట్లు ఎకరాలకు రూ.10 వేలు చొప్పున రైతుబంధు ఇవ్వాలన్నారు. బడ్జెట్ లో ప్రకటిస్తే… కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు చెప్తామని మంత్రి హరీశ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News