Thursday, January 23, 2025

బడ్జెట్‌లో రూ.30 వేల కోట్ల కోత: మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. ఉద్యమంలో భాగంగా కేంద్రప్రభుత్వానికి మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. బడ్జెట్ లో రూ. 30వేల కోట్ల కోత విధించారని మండిపడ్డారు. నిధుల కోతలో ఉపాధి కూలీలకు పని దినాలు తగ్గాయని మంత్రి స్పష్టం చేశారు. పని ప్రదేశాల్లో కనీస మౌళిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ఉపాధి హామీ పథకం కొనసాగించాలని మంత్రి హరీశ్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News