Wednesday, January 22, 2025

ఇదేనా మేకిన్ ఇండియా అంటే: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

minister harish rao comments on Kishan Reddy

హైదరాబాద్: చింత ప్రభాకర్ కు చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ గా అవకాశం ఇవ్వడం పట్ల ఉమ్మడి మెదక్ జిల్లా తరుపున రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ… కిషన్ రెడ్డి సూటిగా అడుగుతున్నాము. సమాధానం చెప్పండి అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తరుపున చేనేత రంగం కార్మికులకు ఏం చేసింది. దీనికి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత రంగం మీద ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని సీఎం హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా బోధన్ పోచం పల్లి , సిరిసిల్ల ల్లో అనాడు ఆత్మ హత్యలకు పాల్పడిన కుటుంబాలకు యాబై లక్షలు అందించామన్నారు. చేనేత రంగం కార్మికులకు ప్రభుత్వం తరుపున అనేక రకాల చేయూతను ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. 350కోట్ల రూపాయల నిధులతో బతుకమ్మ చీరలకు ఆర్డర్ ను చేనేత కార్మికులకు ఇచ్చామని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. నేతన్నలు భీమా, మరమగ్గాల కు సబ్సిడీ లాంటి అవకాశాలు ఇస్తున్నామని వెల్లడించారు. కొండ లక్ష్మన్ బాపూజీ అంటే చేనేత కార్మికులకు రోల్ మాడల్ అన్నారు.

అప్పటి పాలకులు కొండ లక్ష్మన్ బాపూజీ ని అవమానిస్తే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సముచిత స్థానం కల్పించామని స్పష్టం చేశారు. 1250ఎకరాల్లో మెగా టెక్స్ట్ టైల్ పార్క్ వరంగల్ లో ఏర్పాటు చేశామన్నారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న నేతన్న కార్మికులకు ఇక్కడే బరోసా ఇచ్చామని ఆయన తెలిపారు. ఆల్ ఇండియా హ్యాండీ క్రాఫ్ట్ బోర్డు, పవర్ లుమ్ బోర్డులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 2014లో తీసుకొచ్చిన త్రిఫ్ట్ ఫండ్ పథకం కూడా రద్దు చేసింది బీజేపీ. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా చేనేత కార్మికులకు రోడ్డున పడేసిందని విమర్శించారు. చేనేత కార్మికుల మీద పరోక్షంగా భారం వేసింది. దీనివల్ల నూలు దొరకకుండా ఇబ్బందులకు గురి చేసింది. రోజూ తెలంగాణకు వస్తున్న కేంద్ర మంత్రులు ఒక్క రూపాయి సహాయం చేయకుండ వెళతారు. మెగా టెక్స్ట్ టైల్ పార్క్ కు ఒక్క రూపాయి సహాయం అందించదు. రద్దులన్ని కేంద్రానికి వర్తిస్తే పద్దులు అన్ని రాష్ట్ర ప్రభుత్వనిది అని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. కొండ లక్ష్మన్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నాము. నేతన్న భీమా కింద ఐదు లక్షలు సహాయం అందిస్తున్నాము. ఎల్ఐసి, రైల్వే, రైల్వే స్టేషన్ లను అమ్మిన ఘనత కేంద్రానికే దక్కుతుందని ఆరోపించారు. మేకిన్ ఇండియా ఆంటీరి జాతీయ జెండాలను చైనా నుండి తెచ్చారని మండిపడ్డారు. ఎక్కడ మేకిన్ ఇండియా ఇదేనా మేకిన్ ఇండియా అంటే ప్రశ్నించారు. వాళ్ళవి రద్దు మనవి పద్దు అన్నట్టు ఉందన్నారు. చేనేత అభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రభాకర్ కు ధన్యవాదాలు అన్నారు.

ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ….

చేనేత పట్ల ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి సిఎం కెసిఆర్ అన్నారు. గొప్ప అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రులు కెటిఆర్, హరీశ్ రావుకి కృతజ్ఞతలు చెప్పారు. చేనేత సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. తనను నమ్మి అవకాశం కల్పించారు. పేరు నిలబెట్టెలా పని చేస్తానని చింత ప్రభాకర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News