Monday, December 23, 2024

రాజీనామా చేయమంటే కిషన్ రెడ్డి పారిపోయిండు…

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు శుక్రవారం పర్యటించారు. దివ్యాంగులకు మంత్రి హీరీశ్ రావు స్కూటీలను పంపిణీ చేశారు. తెలంగాణను బాగా అభివృద్ధి చేస్తున్నారని చంద్రబాబు అన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఎన్నికలు వస్తున్నాయనే అన్ని పార్టీలు తెలంగాణ అవతరణ వేడుకలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఉద్యమంలో రాజీనామా చేయకుండా కిషన్ రెడ్డి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఎవరి వల్ల తెలంగాణ వచ్చిందో ప్రజలకు తెలుసన్నారు. సమర్థుడి చేతిలో రాష్ట్రం సురక్షితంగా ఉందని ఆయన వెల్లడించారు. ఉద్యమ స్ఫూర్తితో కెసిఆర్ ను హ్యాట్రిక్ సిఎం చేయాలని మంత్రి హరీశ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News