హైదరాబాద్: బిజెపి అబద్దాల ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రమంత్రులు ప్రశంసించారని చెప్పారు. బిజెపి నేతలేమో గల్లీలో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నది బిజెపేనని విమర్శించారు. గిరిజన వర్సీటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకివ్వరో చేప్పాలని డిమాండ్ చేశారు. ఐటిఐఆర్ రద్దు చేసి, కోచ్ ఫాక్టరీ ఎత్తుకు పోయారని హరీశ్ ఆరోపించారు. మేం ఇప్పటికే 1,32,899 ఉద్యోగాలిచ్చామని ఆయన వెల్లడించారు. మరో 50 వేలు లేదా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. కేంద్రంలో ఖాలీగా ఉన్న 15,62లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 2 కోట్ల మందికి ఉద్యోగాలిస్తామని మోడీ ఎన్ని ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ ఉద్యోగాలు పోగొట్టారని చెప్పారు. బ్యాంకులు లూటీ అయి, ప్రభుత్వ రంగం కుదేలయ్యిందని చెప్పుకోచ్చారు. ఐఏఎస్ లను ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
బిజెపి అబద్దాల ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి హరీశ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -