Friday, November 22, 2024

వైఎస్ వారసులకు ఆశీర్వాదం దొరకదు: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -
Minister Harish Rao Comments on YS Descendants
చంద్ర బాబు తొత్తులకు తెలంగాణాలో స్థానం లేదు..  మంత్రి హరీశ్ రావు మండిపాటు

సంగారెడ్డి : వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సిగరెట్, బీడీలతో పోల్చాడు. వారి వారసులను మనం ఆశీర్వదించాలా? మా నీళ్లు, నిధులు దోచుకున్నందుకా? వంద కోట్ల మంది ఒప్పుకుంటేనే అని అవహేళన చేసినందుకు ఆశీర్వదిం చాలా? అని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిళ నుద్దేశించి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కొత్త పార్టీలకు మాట్లాడే అర్హత ఉందా అని ఆయన అడిగారు. అవకాశవాదులకు, చంద్ర బాబు తొత్తులకు తెలంగాణాలో స్థానం లేదని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డినుద్దేశించి వ్యాఖ్యానించారు. సదాశివపేటలో కాంగ్రెస్‌కు చెందిన ఎంపిపి, ఇతర ప్రజా ప్రతినిధులు శనివారం పెద్ద ఎత్తున మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఇతర పార్టీల్లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ ఇస్తామని పొత్తు పెట్టుకుని ఐదేళ్లు కాలయాపన చేసింది వైఎస్ కాదా ? అని ప్రశ్నించారు. తెలంగాణ గురించి మాట్లాడితే, గొంతు నొక్కి అసెంబ్లీ నుంచి బయటికి పంపాడని, ఆ రోజు కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌ల మెప్పుకోసం కాంగ్రెస్ నేతలు నోరు మూసుకున్నారని విమర్శించారు. ఇది పౌరుషాల గడ్డ అని, త్యాగాలతో తెలంగాణ వచ్చిందని, ఈ తెలంగాణ మీద మమ్మళ్ని అవహేళన చేసి, రానే రాదని అడుపడ్డ వారికి వారసులమంటే ఒప్పుకోవాలా? తెలంగాణ ప్రజల హృదయాల్లో మీకు స్థానం లేదు.. లేదు.. ఉండదు అని అయనన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని గత ఎన్నికల్లో చంద్రబాబు తెలంగాణకు వస్తే, పొలిమేరల దాకా ప్రజలు తరిమి కొట్టారని పేర్కొన్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ ముసుగులో రావడానికి చూస్తే, ఇక్కడి ప్రజలు మళ్లీ తరిమికొడతారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఆకాంక్షించే వారికే ఇక్కడి ప్రజలు అవకాశమిస్తారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే టిఆర్‌ఎస్ లక్షమని, రాజకీయాలకు అతీతంగా తమ పార్టీ పనిచేస్తుందని అన్నారు. రూ. 4000 వేల కోట్లతో రాష్ట్రంలో పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నామని, సొంత జాగాలో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టాల్సింది మాత్రమే మిగిలిందని, కరోనా వల్ల కట్ట లేకపోయామని, రానున్న కొద్ది రోజుల్లో సొంత జాగాలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డిసిఎంఎస్ ఛైర్మన్ శివకుమార్, డిసిసిబి వైస్ ఛైర్మన్ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Minister Harish Rao Comments on YS Descendants

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News