Thursday, January 23, 2025

‘ఆరోగ్యానికి’ చికిత్స

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao comprehensive plan for purge of health department

వైద్యారోగ్య శాఖ ప్రక్షాళనకు మంత్రి హరీశ్‌రావు సమగ్ర ప్రణాళిక

హెల్త్ క్యాలెండర్ రూపకల్పన
ప్రతి నెల 3న ఆశావర్కర్లతో, 5న
అన్ని జిల్లాల డిఎంహెచ్‌ఒలు,
సిహెచ్‌సిల ఇన్‌చార్జీలతో, 7న
వైద్య విధాన పరిషత్ కమిషనర్,
ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో
9న డిఎంఇ పరిధిలోని ఆస్పత్రి
సూపరింటెండెంట్లతో జూమ్
యాప్ ద్వారా సమీక్షలు సిబ్బంది
సమయపాలన కోసం నిఘా
వ్యవస్థ ప్రాథమిక ఆరోగ్య
కేంద్రాల్లో సిసి కెమెరాలు
అధికార పంపిణీ డెవలప్‌మెంట్
ఫండ్ ఖర్చుపై అధికారం ఆస్పత్రి
సూపరింటెండ్లకే
ఆస్పత్రులకు, జిల్లా ఆస్పత్రులకు
నాన్ మెడికల్ పాలనాధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్ : వైద్యారోగ్యశాఖ ప్రక్షాళనపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. కోవిడ్-19 మహమ్మారి నేర్పిన గుణాపాఠాల నేపథ్యంలో భవిష్యత్తులో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసేదిశగా ప్రయత్నాలు మొదలెట్టింది. ము ఖ్యంగా గతేడాది వైద్యారోగ్యశాఖకు రూ.6,295 కోట్లు (బడ్జెట్ లో 2.5 శాతం) ఉన్న దాన్ని రూ. 11,440 కోట్లు (బడ్జెట్ లో 4.5 శాతం)కు పెం చింది. ఇందుకు తగినట్టుగా ఫలితాలు రాబట్టాలని సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వినూత్న నిర్ణయాలకు శ్రీకారం చు ట్టారు. ఇందులో భాగంగా మంత్రి హరీశ్ రావు రెగ్యులర్ గా విభాగాల వారీగా సమీక్షలు నిర్వహించడంతో పాటు ప్రతి నెలా ఒక క్రమమైన పద్ధతిలో సమీక్షలుండేలా హెల్త్ క్యాలెండర్ ను రూ పొందించారు. ప్రతి నెలా మూడో 3వ తేదీన ఆశావర్కర్లతో, 5న అన్ని జిల్లాల డిఎంహెచ్‌వొలు, పి హెచ్‌సిల ఇన్‌ఛార్జీలతో, 7న వైద్యవిధాన పరిషత్ కమిషనర్, ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో, 9న డిఎంఇ పరిధిలోని ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో సమీక్షించేందుకు ఆ శాఖ ప్రత్యేకంగా జూ మ్ యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంలో ఆయూ ష్ సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు కసరత్తు మొదలెట్టారు. ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో ఆధునిక వైద్యంతో పాటు ఆయూష్ సేవలను కూడా ప్రవేశపెడితే ఆయూష్ వైద్యులకు పనితో పాటు రోగులకు ఇష్టమైన వైద్యం ఎంచుకునే ఆప్షన్ ఇచ్చినట్టవుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో అధికారులు, డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించేలా నిఘా వ్యవస్థను పెం చాలని భావిస్తున్నది. ఇందుకోసం ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో సిసి కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేసి దాన్ని ఉన్నతాధికారుల పర్యవేక్షణ పరిధిలోకి తేనున్నారు.

సవరణలకు సమాయత్తం 

ఆస్పత్రుల్లో చిన్న, చిన్న లోపాలకు రాష్ట్ర సర్కారు విమర్శలను ఎదుర్కొంటోందనీ, దీన్ని నివారించేందుకు అధికార పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆస్పత్రుల డెవలప్ మెంట్ ఫండ్ ఖర్చు పెట్టుకునే అధికారాన్ని ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లకే కట్టబెట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల్లో పని చేసే డాక్టర్ల ప్రయివేటు ప్రాక్టీస్ ప్రజారోగ్య వ్యవస్థకు ప్రధాన ఆటంకంగా ఉన్నట్టు గుర్తించింది. దీన్ని నివారించేందుకు భవిష్యత్ నియామకాల్లో ప్రయివేటు ప్రాక్టీసు చేయబోమని హామి ఇచ్చే వారికే అవకాశం ఇచ్చేలా సంబంధిత సర్వీస్ రూల్స్ లో సవరణ తీసుకురావాలని యోచిస్తున్నది.

నాన్‌మెడికల్ అధికారులకు పాలనా బాధ్యతలు 

రాష్ట్రంలోని బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పాలనా బాధ్యతలను నాన్ మెడికల్ అధికారులకు అప్పగిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని పరిశీలిస్తున్నది. ప్రస్తుతం డాక్టర్లకే పదోన్నతుల రూపేణా పాలనా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, వారిని వైద్యసేవలకు పూర్తిగా వినియోగించుకుంటూ, పాలనాధికారులుగా ఆర్‌డివొ తదితర అధికారుల సేవలను వాడుకునే విషయంపై అధ్యయనం చేస్తున్నది.

శస్త్రచికిత్సలపై నజర్ 

ఆరోగ్యశ్రీ కింద ప్రోత్సాహకమిస్తున్నా ప్రభుత్వాస్పత్రుల్లో ఆపరేషన్లు తక్కువగా జరగడాన్ని నివారించనున్నారు. ఆయా విభాగాల్లో నిష్ణాతులైన వైద్యులున్నా సరే శస్త్రచికిత్సలు తక్కువగా జరగడానికి ఆయా ఆస్పత్రుల్లో అవకతవకలకు పాల్పడుతున్న వారే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చింది. దీనికి చెక్ పెట్టేందుకు టార్గెట్లను నిర్దేశించనున్నది. పరికరాల మరమ్మతు సాకు చెప్పకుండా ఇప్పటికే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి రూ.28 కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులను ప్రయివేటుకు తరలించే వ్యక్తులను గుర్తించి శిక్షించేందుకు సిసి కెమెరాల వ్యవస్థ ఏర్పాటుతో పాటు, ఆస్పత్రికి వచ్చిన రోగిని వెంటనే ఆరోగ్యశ్రీ కింద పేరు నమోదు చేసేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మందులపై అధ్యయనం 

ప్రభుత్వాస్పత్రుల్లో తగినన్ని మందులున్నా సరే జనరిక్ మందులను కాకుండా బ్రాండెడ్ మందులను రాస్తూ కొంత మంది డాక్టర్లు ప్రయివేటు మెడికల్ షాపులకు రోగులు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నట్టు గుర్తించింది. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించనుంది. ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని రకాల మందులను ఇస్తుండగా ప్రయివేటు మెడికల్ షాపులను ఎందుకు కొనసాగించే అవసరమున్నదా అనే విషయంపై లోతైన అధ్యయనం చేస్తున్నది.

రోగులు స్వల్పం..వైద్యులు అధికం 

కొన్ని ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య తక్కువగా ఉంటున్న డాక్టర్లు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించింది. ఉదాహరణకు మలక్ పేట, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రుల్లో వచ్చే రోగులకు అవసరమైన దాని కంటే సిబ్బంది ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. ఇలాంటి వారిని రోగుల రద్దీ ఎక్కువగా ఉన్న చోట ఉపయోగించుకోవాలని యోచిస్తున్నది.

సిజేరియన్‌లపై సర్కారు సీరియస్ 

వైద్యారోగ్యశాఖ మంచి గుర్తింపు పొందినప్పటికీ, కొన్నింటి విషయంలో పనితీరు అధ్వానంగా ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. అలాంటి వాటిలో సిజేరియన్ ఆపరేషన్ల విషయంలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 20 నుంచి 30 శాతముండగా, మన రాష్ట్రంలో అది కాస్తా 64 శాతంగా ఉండటం వెనుకబాటుతనానికి నిదర్శనం. ఇందులో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కరీంనగర్ జిల్లాలోలో 98 శాతం, మంచిర్యాలలో 97 శాతం, నిర్మల్ లో 93 శాతం డెలివరీలు సిజేరియన్లతోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ శస్త్రచికిత్సల కారణంగా మహిళలు 35 ఏండ్లకే బలహీనపడటం, సిజేరియన్ ఆపరేషన్ అయిన తల్లుల్లో పిల్లలకు ఇవ్వాల్సిన ముర్రుపాలు సరిగ్గా ఇవ్వలేకపోవడంతో బిడ్డ ఆరోగ్యం కూడా ఇబ్బందిగా మారుతున్నది. దీంతో ఈ పరిస్థితిని మార్చేందుకు ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్న సిబ్బందికి ఇస్తున్న ప్రోత్సాహకాన్ని నిలిపేసి సహజ ప్రసవాలకు ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు అధిక డబ్బులకు ఆశపడి సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయని గుర్తించి వాటిని కట్టడి చేసేందుకు చర్యలు మొదలెట్టింది. అదే విధంగా నాకో నిర్వహించిన సర్వేలో రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మిగిలిన రాష్ట్రాల కన్నా చాలా వెనుకబడింది. ఇలా సేవలందించడంలో విఫలమవుతున్న వాటిని గుర్తించి వాటిని సరి చేయడం ద్వారా ప్రక్షాళన చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ భావిస్తున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News