Tuesday, November 5, 2024

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao conveys Ramzan greetings

హైదరాబాద్: ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ పండుగ పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, ముస్లిం సోదర, సోదరీమణులకు మంత్రి మంత్రి హరీశ్ రంజాన్ శుభాకకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమని, పండుగను భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సవాలతో జరుపుకోవాలన్నారు. సేవాదృక్పథ, భక్తి ప్రవృతులు, సోదర భావాలు మత సామరస్యాన్ని చాటి చెప్పే ఈ పండుగను ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగను రాష్ట్ర పండుగగా మన ప్రభుత్వ గుర్తించిందన్నారు. కరోనా వ్యాపివ్త నేపథ్యంంలో ఈ పండుగను సామూహికంగా జరుపుకోలేకపోతున్నాం అని, ఎవరి ఇంట్లో వారే వేడుకగా జరుపుకుని యావత్ ప్రపంచ ప్రజలు అందరం బాగుండాలి అని కరోనా మహమ్మారి బారి నుంచి అందరం బయటపడాలని ఆ అల్లాని ప్రార్థించాలని కోరారు. పేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందించాం అని, మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ముస్లింల కొరకు అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం అని అన్నారు. రంజాన్ మాసమంతా ప్రపంచవ్యాప్తంగా నిష్టతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Minister Harish Rao conveys Ramzan greetings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News