Wednesday, January 22, 2025

బిజెపి మాయలో పడొద్దు: మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

minister harish rao distributes Aasara Pension

దుబ్బాక: ఉచితాలు బంద్ చేయాలని చెబుతున్న బిజెపి ప్రభుత్వాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు బంద్ చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన మిరుదొడ్డి మండలంలో ఇప్పటికే 10,041 ఉండగా, అదనంగా 1103 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్లను మంత్రి పంపిణీ చేశారు. మంత్రి వెంట మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నదని మంత్రి గుర్తుచేశారు. బడా బడా పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడి దారులకు ఓవైపు 10 లక్షల కోట్లు బిజెపి ప్రభుత్వం మాఫీ చేస్తూ.. మరోవైపు ఉచితాలు వద్దని అనవసర రాద్ధాంతం చేస్తున్నదని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 52, 722 మంది లబ్ధిదారులకు ఆసరా ఫించన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వంకు కళ్లు కనపడక కాళేశ్వరం నీళ్లు పారలేదనీ, అనవసర విమర్శలు చేస్తున్నదని తెలిపారు. బిజెపి ప్రభుత్వానివన్నీ.. పచ్చి అబద్ధాలు జూటా మాటలు వారి మాయలో పడొద్దని ప్రజలకు మంత్రి హరీశ్ రావు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News