Sunday, December 22, 2024

న్యూట్రిషన్‌ కిట్స్‌ పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్ధిక మంత్రి హరీశ్ రావు టి.బి వ్యాధిగ్రస్తులకు ఉచితంగా టిహెచ్ఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. టిబి ఎలా వస్తుందో అవగాహన పెంచుకోవాలన్నారు. వ్యాధి సోకిన వారు సరైన వైద్య సదుపాయం పొందాలని సూచించారు. పౌష్తీకాహారం కోసం 500 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రం లో 39000 మంది టిబి పేషేంట్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 2025 సంవత్సరం నాటికి పూర్తిగా టిబిని నిర్మూలించాలని నిర్ణయించామన్నారు. టిబి పేషేంట్లకు మంచి పౌష్టిక ఆహారం అవసరం, అందుకే పేషేంట్లకు దాతల సహకారంతో న్యూట్రర్షియన్ కిట్లు పిపిణీ చేయనున్నాని తెలిపారు. జిల్లాలో 1000 మందికి రాష్ట్రంలో 39000 మందికి న్యూట్రీషియన్ కిట్స్ అందిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతినెలా మొదటి వారంలో ఈ కిట్స్ అందజేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని టిబి రహిత రాష్ట్రాంగా తీర్చి దిద్దుదామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సమాజంలోని స్వచ్ఛంద సంఘాలు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News