Sunday, January 19, 2025

ఈటల రాజేందర్ పై మంత్రి హరీశ్‌రావు ఫైర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఓట్ల కోసం జూటా మాటలు మాట్లాడుతున్న ఈటల రాజేందర్ గజ్వేల్‌ను అభివృద్ధి చేసినట్లు నీ హుజురాబాద్‌ను చేశావా అని మంత్రి హరీశ్‌రావు ఈటలను ప్రశ్నించారు. తిన్నింటని వాసాలనే లెక్కపెట్టావ్, అన్నం పెట్టిన కెసిఆర్‌ను మోసం చేశావని ఈటలపై ఘాటుగా మంత్రి విమర్శించారు. అంతకు ముందు దివ్యాంగులతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం పెన్షన్లు ఈ ఎన్నికల తర్వాత మూడోసారి కెసిఆర్ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు రూ.6వేలకు పెంచుతున్నామని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు డా. యాదవ రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి,

వికలాంగ సంక్షేమ సంస్థ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి, డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మాజీ డిసిసిబి ఛైర్మన్ ఎలక్షన్ రెడ్డి,మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, ఎంపిపి అమరావతి, జడ్పీటిసి పంగ మల్లేశం, గృహనిర్మాణ సంస్థ మాజీ ఛైర్మన్ మడుపు భూమిరెడ్డి, మండల సర్పంచ్‌లు ఫోరం అధ్యక్షుడు చెరుకు చంద్ర మోహన్ రెడ్డి, నియోజకవర్గంలోని వివిధ మండలాల బిఆర్‌ఎస్ నాయకులు, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, వివిధ మండలాల దివ్యాంగులుతదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News