Saturday, November 2, 2024

దమ్ముంటే బిలియన్ మార్చ్ ఢిల్లీలో పెట్టు

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao fires at BJP chief Bandi Sanjay

దేశవ్యాప్తంగా నిరుద్యోగులు వచ్చి పోరాటం చేస్తారు
ప్రభుత్వరంగ సంస్థలు అమ్మి ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారు
బిజెపి చీఫ్ బండి సంజయ్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్

మన తెలంగాణ/కొత్తగూడెం : ఉద్యోగాలు, ఉద్యోగాలంటూ బిజెపి నేతలు దొంగ జపం చేస్తున్నారని, ఉద్యోగాల కోసం హైదరాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ కాదు.. దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టాలని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాష్ట్ర వై-ద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సవాల్ విసిరారు. జిల్లా కేంద్రం భద్రాద్రి కొత్తగూడెంలో శనివారం వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపి నామా నాగేశ్వరరావుతో కలసి బిజెపి నేతలపై హరీష్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చిన్న విషయాన్ని బిజెపి భూతద్దంలో చూపెట్టి ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య చిచ్చుపెట్టేందుకు చూస్తొందన్నారు. బిజెపికి తెలంగాణాలో ఉద్యోగావకాశాలు, నో టిఫికేషన్ల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు త ర్వాత రాష్ట్రంలో మొత్తం లక్షా 32,899 ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. టిఎస్‌పిఎస్‌సి ద్వారా 30,594 ఉద్యోగాలు, పోలీస్ రిక్రూట్‌మెం ట్ బోర్డు ద్వారా 31,972, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 9,355, సింగరేణిలో 12,500, విద్యుత్ సంస్థ ద్వారా 6,648, డిసిసిబిల ద్వారా 1,571, టిఆర్‌టి ద్వారా 8,792, గురుకులాల్లో 11,500 పోస్టులు భర్తీ చేశామన్నారు. మరో 50నుంచి 60వేల వరకు పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోందన్నారు. నాన్ లోకల్ విధానాన్ని రద్దుచేసి 95శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా కొత్త జోనల్ విధానాన్ని తెచ్చా మన్నారు. ఇందుకు 317జీవో విడుదల చేసినట్లు వివరించారు.

దేశంలో నిరుద్యోగం శాతం 7.91 కాగా, తెలంగాణలో అది 2.2శాతం మాత్రమేనన్నారు. నిరుద్యోగ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకుపోతుంటే బిజెపి నేతల కళ్లు బైర్లు కమ్ముతున్నాయని, సిఎం కెసిఆర్ పాలనలో బంగారు తెలంగాణ కల సాకారం అవుతుంటే కేంద్రం లో బిజెపి దేశాన్ని నిరుద్యోగ భారత్‌గా మారుస్తోందని ఎద్దేవా చేశారు. దేశంలో ఏడేళ్లలో ఏడు ఐఐఐఎంలు కేటాయిస్తే తెలంగాణకు ఒక్కటీ కే టాయించలేదన్నారు. ఐఐఐటిలు 16 ఏర్పాటు చేస్తే తెలంగాణకు ఎన్నికేటాయించారని ప్రశ్నించారు. 157 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదన్నారు. వీటిని రాష్ట్రానికి ఇప్పించటంలో బిజెపి ఎంపిలు చేసిన కృషి జీరో అని హరీష్‌రావు దెప్పిపొడిచారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News