Friday, January 17, 2025

పోరాటాల గడ్డపై.. నడ్డా అబద్దాలు: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

minister harish rao fire on bjp leaders

సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలో డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో ఆదివారం పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బిజెపి నాయకులపై ఫైర్ అయ్యారు. నడ్డా మాటలు జూటా మాటలు అంటూ ఘాటుగా స్పందించారు. ఇది తెలంగాణ ప్రాంతము పోరాటాల గడ్డ… నడ్డా లాంటి వాళ్ళ అబద్దాపు మాటలు నమ్మరన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ కు పోదాం, వరంగల్ హాస్పిటల్ కి పోదాం తేడాలు చూపిస్తామన్నారు. గుజరాత్, మహారాష్ట్రలో ఎందుకు పెన్షన్లు ఇస్తలేరు, కేంద్ర వాటా తెలంగాణలో ఒక్క పైసా కూడా లేదన్నారు. కన్నా కొడుకు కన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకుగా ఆదుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. నడ్డా అబద్ధాల కోరు వరంగల్ సభలో అన్ని అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. వరంగల్ లో 3నెలలో హాస్పిటల్ పనులు 15 శాతం పూర్తి అయ్యాయి అదే బీబీ నగర్లో కేంద్రం చేపట్టిన ఎయిమ్స్ హాస్పిటల్ లో కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనతో వస్తే వరంగల్ హాస్పిటల్ కి తీసుకెళ్లి పనులను చూపిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News