Friday, January 17, 2025

మనది తండ్లాట… బిజెపిది తొండాట..

- Advertisement -
- Advertisement -

minister harish rao fires on central government

రైతులను నట్టేట ముంచుతున్న బీజేపీ ని ఎండగట్టాలి… నేడు అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు పెద్ద ఎత్తున చేపట్టాలి.. 7 న జిల్లా కేంద్రంలో 5వేల మందితో నిరసన దీక్ష.. 8 వ తేదీన ప్రతి రైతు ఇంటి పై నల్లా జెండా ఎగరేయాలి.. గల్లీ గల్లీ లో నల్లా జెండా తో నిరసన ఢిల్లీ కి సెగ చూపించాలి..

సిద్దిపేట: నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులతో మంత్రి హరీష్ రావు ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మనం రైతుల కోసం తండ్లాడుతుంటే.. బీజేపీ తొండాట అడుతుంది అని, యాసంగి వడ్లు కొనాలి అని టిఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ రైతులు పండిచిన యాసంగి వడ్లు కొనాలి అని గత కొద్ది నెలలు పోరాటం చేస్తుంటే.. కేంద్రంలోని కేంద్ర మంత్రులు, రాష్ట్రంలోని బిజెపి నాయకులు తలా ఓ మాట తలా తోక లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా కేంద్రంతో కొనించే బాధ్యత నాదే అన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రం కొంటుంది అన్న కేంద్ర మంత్రి తోక జాడించారని చెప్పారు. కేంద్రం ఆదాయం పెంచుతామని ప్రగల్భాలు పలికిన బిజెపి పెట్రోల్, డీజిల్,గ్యాస్ అధికంగా ధరలు పెంచిందన్నారు.

ఇందన ధరలు పెంచి, రైతుల వడ్లు కొనక నట్టేట ముంచుతుందన్నారు.. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ రైతుల కోసం దేశంలోనే ఆదర్శమైన కార్యక్రమాలు చేసాడన్నారు. రైతు బంధు, రైతు భీమా, ఏరువులు , 24 గంటల కరెంట్ , సాగునీరు ఇలా ఎన్నో చేశారని.. కేంద్రం చేసే తొండి ఆటను, రైతుల గోస పుట్టిస్తున్న కేంద్రం ని సోమవారం నుంచి జరిగే నిరసన కార్యక్రమాలతో ఎక్కడిక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సోమవారం అన్ని మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టాలి , 7 న జిల్లా కేంద్రంలో 5వేల మంది తో నిరసన దీక్ష ఉంటుందని చెప్పారు. 8న ప్రతి పల్లెలో ప్రతి ఇంటిపై నల్లా జెండా ఎగరాయాలని ఆరోజు నేను నా ఇంటి పై నల్లా జెండా ఎగరవేస్తా అని చెప్పారు. భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్, సూడా చైర్మన్, జిల్లా రైతు బంధు అధ్యక్షులు, జడ్పిటీసిలు, ఎంపిపి లు మార్కెట్ కమిటీ చైర్మన్ లు, కో ఆపరేట్ చైర్మన్ లు , ఆత్మ కమిటీ చైర్మన్ , పార్టీ మండల, గ్రామ శాఖ అధ్యక్షుడు , రైతు బంధు కో ఆర్డినెటర్స్ , పార్టీ అనుబంధ రైతు గ్రామ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులకు ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News