Wednesday, January 22, 2025

కెసిఆర్ పాలనలో ప్రతి రైతు పోలానికి నీరు: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

చిన్నకోడూరుః ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో ప్రతి రైతు పోలానికి నీరు వచ్చిందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు. చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డి పల్లి రాజీవ్ రహదారి నుంచి చెర్ల అంకిరెడ్డిపల్లి వరకు రూ. 61.80 లక్షలతో బీటి రోడ్డు మరమ్మత్తు నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. అనంతరం తెలంగాణ క్రీడా ప్రాంగణం కోసం భూమి పూజ చేశారు. అనంతరం పల్లె ప్రకృతి వనంను ప్రారంభించారు. అదే విధంగా ఓపెన్ జిమ్, డంపింగ్ సెగ్రీ గేషన్ షెడ్, స్మశాన వాటిక గ్రేవ్ యార్డు, శాలివాహన కమ్యూనిటి హాల్, సీసీ రోడ్ల నిర్మాణం కోసం శంకుస్ధాపన, మిషన్ భగిరథ ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంక్, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, మహిళా ఎస్సీ ఫంక్షన్‌హాల్ శంకుస్ధాపన చేశారు.

అనంతరం నూతన గ్రామ ప్రంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ఆనాడు కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం చేయాలంటే కళ్లలో నీళ్లు వచ్చేవన్నారు. బీఆర్‌ఎస్ వచ్చాక పండిన పంట ప్రతి గింజను కాంటాలు పెట్టి దాన్యం కొనుగోళ్లు చేసిందన్నారు. గ్రామ పల్లె చెరువు మరమ్మత్తు పనులు త్వరలోనే ప్రారంభం చేస్తామని చెప్పారు. వారంలో కాళేశ్వరం రంగనాయక సాగర్ నీళ్లు తెచ్చి గ్రామ పల్లె చెరువు నింపుతామని పనులు పూర్తయ్యే వరకు పర్యవేక్షణ చేయాలని జడ్పీ , ఎంపీపీలకు సూచించారు. గ్రామ ఎఎన్‌ఎం మమత బాగా పని చేస్తున్నారని అభినందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను సత్కరించాలని ఆర్డీఓ అనంతరెడ్డికి సూచించారు. నార్మల్ డెలివరీల ఆవశ్యకతను గురించి ప్రజలకు చక్కగా అవగాహన కల్పించారు. ఆశాకార్యకర్తలు నార్మల్ డెలివరీలు చేయించేలా ప్రత్యేక దృష్టి పెట్టి గర్బిణీలకు కౌన్సిలింగ్ చేయాలని సూచించారు.

దాన్యం కొనుగోళళ్లు జరిపిన 17 స్వయం సహాయక సంఘాలకు రూ. 1,10 కోట్ల చెక్కు పంపిణి చేశారు. చర్ల అంకిరెడ్డిపల్లి గ్రామంలో బైపాస్ రోడ్డు బాగా నచ్చిందని గ్రామంలో అవసరమైన సీసీ రోడ్లకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు. గ్రామంలో 715 మంది రైతులకు రూ. 5.30 కోట్ల రైతుబంధు పంపిణీ చేసినట్లు తెలిపారు. అంతకు ముందు చిన్నకోడూరు మండలంలోని 25 గ్రామాలలో ఏ గ్రామంలోనైనా పొద్దున పూట వీధి దీపాలు వెలుగొద్దు అన్నారు. ప్రతి గ్రామంలో సెగ్రీ గేషన్ షెడ్లలో వర్మి కంపోస్టు సేంద్రియ ఎరువు తయారు కావాలని ఎంపీ, ఎంపీడీఓ, ఆయా గారమాల పంచాయతీ కార్యదర్శులను అదేశించారు. అనంతరం మల్లన్న దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదవ సంఘ కుల ప్రతినిదులు మంత్రిని శాలువాతో సన్మానం చేశారు. మంత్రి వెంట జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాదాకృష్ణ శర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి, గ్రామ సర్పంచ్ రాజబోయిన స్వర్ణలత శ్రీనివాస్ యాదవ్, ప్రజాప్రతినిదులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News