Thursday, November 21, 2024

సిద్దిపేటకు ఆటో డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లు

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Help for Auto Drivers in Siddipet

* సొంత ఇల్లు తాకట్టు పెట్టి.. ఆర్థిక భరోసా కల్పిస్తున్నా..
* ఆటోవాల జీవితాల్లో మార్పు కోసమే కొత్త సొసైటీ ఏర్పాటు
* భవిష్యత్‌లో ఆటో గ్యారేజ్ ఏర్పాట్లు చేస్తా
* ఆటోడ్రైవర్ల ప్రవర్తనపైనే సిద్దిపేట భవిష్యత్

సిద్దిపేట: సిద్దిపేట పట్టణానికి ఆటోవాలలే బ్రాండ్ అంబాసిడర్‌లు అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి గార్డెన్‌లో గురువారం ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీలో ఆటో డ్రైవర్లకు ఆయన రుణాలతో పాటు యూనిఫాంలు పంపిణీ చేసి మాట్లాడారు. ఆటో డ్రైవర్లలో మార్పు వచ్చి ఆనందంగా జీవించాలన్నారు. విమానం నడిపే డ్రైవర్ విధి నిర్వహనకు వెళ్లే సమయంలో వారి కుటుంబసభ్యులు సంతోషంగా పంపుతారని, అలాగే మీ కుటుంబ సభ్యులు సైతం అలాగే మిమ్మల్ని సంతోషంగా పంపించాలన్నారు. మీకు సమాజంలో మంచి పేరు వచ్చే విధంగా మెదలాలన్నారు. గతంలో ఆటోవాలాలు అవసరాల కోసం అధికంగా వడ్డీకి డబ్బులు తీసుకుని నింతరం కష్టపడేవారని, వచ్చే డబ్బులు సైతం వడ్డీ రూపంలో కట్టి ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారని అన్నారు. ఈ సొసైటీ ద్వారా రూ.5నుంచి 10వేల వరకు వడ్డీలేని రుణాలను ఇవ్వడంతోపాటు పిల్లల చదువుకోసం ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

కరోనా వల్ల కార్యక్రమం ఆలస్యం అయిందని గతంలో రిమ్‌జిమ్‌రిమ్ జిమ్ హైదరాబాద్.. రిక్షా వాల జిందాబాద్ అని పాట ఉండేదని.. మీరు ఇప్పుడు దాన్ని మార్చి రిమ్‌జిమ్.. రిమ్‌జిమ్.. సిద్దిపేట ఆటోవాలా.. జిందాబాద్ అని మార్చాలని ఆటో డ్రైవర్లను కోరారు. ఆటో డ్రైవర్ల జీవితాల్లోమార్పు రావడమే.. తన ధ్యేయమని మంత్రి అన్నారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తన సొంత ఇంటి స్థలాన్ని తాకట్టు పెట్టి మరి ఆటో క్రెడిట్ ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశామని తెలిపారు. సిద్దిపేటలో ఆటో డ్రైవర్ ఇంట్లో శుభకార్యం జరిగితే రూ. 5వేలు సొసైటీ ద్వారా అందిస్తామని తెలిపారు. త్వరలోనే ఇక్కడ ఒక ఆటో గ్యారేజీ ఏర్పాటు చేస్తామని మంత్రి హమీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సతీష్‌కుమార్, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, జడ్పీ చైర్‌పర్సన్ రోజా శర్మ, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్, జిల్లా రవాణాశాఖ అధికారి చిట్టి రామేశ్వర్, మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, ప్రజాప్రతినిధులు, నాయకులు నర్సింలు, లకా్ష్మరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News