Sunday, January 26, 2025

ఇక బస్తీ ప్రజల సుస్తి నయం : మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట :  బస్తీ ప్రజల సుస్తీ నయం చేయడానికే బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి అందుబాటులో తెచ్చామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట పట్టణంలోని 11వ వార్డు కాళ్లకుంట కాలనీలో బస్తీ దవాఖానను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళ్లకుంట కాలనీ బస్తీ దవాఖానలో అన్నీ రకాల సౌకర్యాలు మందులు అందుబాటులో ఉన్నాయని, సిద్ధిపేటలో 1000 పడకల ఆసుపత్రి త్వరలోనే అందుబాటులో రానున్నదని తెలిపారు.

రాబోయే రోజుల్లో గుండె, క్యాన్సర్, కిడ్నీ లాంటి వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి మనిషికి కరోనా తర్వాత 10 కిలోల బియ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నదని, సంక్రాంతి పండుగ తరువాత ఇంటి అడుగుజాగలో ఇళ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ బస్తీ దవాఖానను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News