Friday, November 22, 2024

ప్రగతి పథంలో ఆరు గ్రామాలు

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao inaugurated development works
రాష్ట్ర మంత్రి హరీశ్ చొరవతో మార్గం సుగమం
రాష్ట్రంలో అతిపెద్ద రెండవ బీటీ రోడ్డు నిర్మాణం ప్రారంభం
ఏన్సాన్ పల్లిలో రూ.15 కోట్లతో 18 కిలోమీటర్లు మేర బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట: రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద బీటీ రోడ్డుకు పీఏంజీఏస్ వై కింద నిధులు మంజూరు చేయించడంతో ప్రగతి బాట పట్టింది. సిద్ధిపేట నియోజకవర్గంలోని ఏన్సాన్ పల్లి మీదుగా పొన్నాల, కిష్టసాగర్, చిల్ల కాలనీ, అలాగే ఏన్సాన్ పల్లి, వెంకటాపూర్, గుడికందుల ఈ ఆరు గ్రామాలకు ప్రగతి పథంలో మహర్దశ పట్టింది. మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ చూపడంతో మార్గం సుగమమైంది. ఈ మేరకు ఏన్సాన్ పల్లి గ్రామ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా బుధవారం ఉదయం రూ.15 కోట్ల రూపాయల వ్యయంతో 18 కిలోమీటర్లు మేర ఆరు గ్రామాలకు అనుసంధానంగా కలిపే బీటీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని స్పష్టం చేశారు. సిద్ధిపేట నియోజకవర్గంలోనే రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద బీటీ రోడ్డు పనులు ప్రారంభించుకుంటున్నట్లు, తొలి అతిపెద్ద బీటీ రోడ్డు సైతం నాంచారుపల్లి గ్రామం వద్ద గతేడాదే ప్రారంభం చేసుకున్నామని, ఈ బీటీ రోడ్డున నాంచారుపల్లి, బక్రీ చెప్యాల, వెల్కటూరు, కొనాయపల్లి, వెంకటాపూర్, నర్మెట్ట, నంగునూరు, ఘనపుర్, కొండంరాజ్ పల్లి, ఖాతా 10 గ్రామాల మీదుగా చేపట్టిన పనులు ఇప్పటికే అర శాతం మేర పూర్తయ్యాయని, బీటీ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు.

కోమటి చెరువు టూ ఏన్సాన్ పల్లి ఫోర్ లేన్ రహదారి

రూ.9 కోట్లతో టూ లేన్ నుంచి నాలుగు వరుసలుగా రహదారి అభివృద్ధి

సిద్దిపేట కోమటి చెరువు టూ ఏన్సాన్ పల్లి వరకూ ఫోర్ లేన్ రహదారి నిర్మాణం చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. రూ.9 కోట్ల రూపాయలు వెచ్చించి రెండు వరుసలు నుంచి నాలుగు వరుసలు రహదారిగా 3 కిలోమీటర్లు వరకు అభివృద్ధి చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ దారి పొడవునా ఉన్న టూ లేన్ రోడ్డును ఫోర్ లేన్ చేయడంతో పాటుగా సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ వస్తుందని, పట్టణ తరహాలో ఏన్సాన్ పల్లి రూపురేఖలు మారనున్నాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News