మర్రి గూడ: తెలంగాణ రాష్ట్రం సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాల అమలు లో దేశానికి రోల్ మోడల్ గా వుందని,ఇతర రాష్ట్రాలు,కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తూ అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు . ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్లు, వైద్య సిబ్బందిని కోరారు. మంగళవారం మర్రిగూడ మండల కేంద్రంలో 5 కోట్ల రూ. ల అంచనా వ్యయం తో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని మంత్రి హరీష్ రావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు కల్పన తో పాటు, డాక్టర్లను,వైద్య సిబ్బందిని నియమించి బలోపేతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఆదేశాల మేరకు 2022 డిసెంబర్ 31న రాష్ట్ర వ్యాప్తంగా 950 మంది డాక్టర్లను కొత్తగా నియమించినట్లు తెలిపారు. అందులో నల్గొండ జిల్లాలో వివిధ ఆస్పత్రిలో 42 మందిని కొత్త గా డాక్టర్ నియమించినట్లు, మర్రి గూడ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎనిమిధి మంది డాక్టర్లను నియా మకం చేసినట్లు తెలిపారు. వీరంతా జనవరి ఒకటిన విధులలో చేరినట్లు ఆయన వెల్లడించారు. డాక్టర్లను నియామకం,సదుపాయాలు కల్పించి ఈ ఆస్పత్రి ని ఈ రోజు ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు.
గతంలో హామీ ఇచ్చినట్టు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం నల్గొండ హైదరాబాద్ వెళుతున్న రోగులకు అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసినట్లు డిజిటల్ ఎక్స్ రే యంత్రం కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కోరినట్లు గర్భిణీలకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించేందుకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ ను,గైనిక్ డాక్టర్ ను నియామకం చేయనున్నట్లు ప్రకటించారు. నేత్ర,డెంటల్,పీడియాట్రిక్ డాక్టర్లు ఆసుపత్రి లో సేవలు అందిస్తారని, కేటరాక్ట్ పరీక్షలు కూడా ఆసుపత్రి లో నిర్వహిస్తారని ఆయన వివరించారు.
కొత్తగా జనవరి ఒకటిన విధులలో చేరిన 8 మంది డాక్టర్లను సభా ముఖంగా మంత్రి పరిచయం చేశారు. నల్గొండ జిల్లాలో 59 శాతం ప్రభుత్వ ఆసుపత్రులలో,41 శాతం ప్రైవేట్ ఆసుపత్రులలో డెలివరీ లు జరుగుతున్నాయని, రాష్ట్రం లో సరాసరి 66 శాతం ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ లు జరుగుతున్నాయని,ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ లు పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ను ఆయన ఆదేశించారు .జిల్లా 60 శాతం సిజెరియన్ ఆపరేషన్ లు జరుగుతున్నట్లు,సిజేరియన్ లు తగ్గించి సాధారణ ప్రసవాలు చేసేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. సి.సెక్షన్ లో వలన తల్లి,బిడ్డల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని, ఇన్ఫెక్షన్ లు ,రక్త స్రావం,ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు.
పుట్టిన బిడ్డకు మొదటి గంట లోనే తల్లి ప్రాలు తాగిస్తే రోగ నిరోధక శక్తి పెరిగి,చురుగ్గా ఆరోగ్యం గా ఉంటారని అన్నారు.
34 శాతం తల్లులు మాత్రమే బిడ్డలకు పుట్టిన మొదటి గంటలో తల్లి పాలు త్రాగి స్తున్నారని , తల్లిపాలు అమృతం తో సమానం అని,తల్లి పాలు తాగిన బిడ్డలు ఆరోగ్య వంతమైన భావి పౌరులుగా పెరుగుతారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలు ఒక్కొక్కటి గా నెరవేరుతున్నట్లు ఆశాభావం వ్యక్తం పరిచారు. నల్గొండలో బత్తాయి మార్కెట్,నకిరేకల్ లో నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో,సంకల్పం తో నల్గొండ ,సూర్యా పేట లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాల లు ఏర్పాటు చేసినట్లు,అన్ని సౌకర్యాలు కల్పించి డాక్టర్ లు,వైద్య సిబ్బందిని నియమించి నట్లు తెలిపారు.
టిఫా స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేసినట్లు, ప్రతి గర్భిణీ కి నాలుగు సార్లు ఏ.ఎన్.సి.చెక్ అప్ చేయాలని, ఆసుపత్రి లో డెలివరీ లు జరిగితే కె సి.అర్ కిట్ అందిస్తున్నట్లు, త్వర లోనే కె సి.ఆర్ న్యూట్రిషన్ కిట్ అందించ నున్నట్లు తెలిపారు. బి.పి.,షుగర్ కిట్ లు వైద్య సిబ్బంది పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఒక్క ఖాళీ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని,కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఊడగొడుతు ప్రభుత్వ రంగ సంస్థలు బి.ఎస్.ఎన్.ఎల్,ఎల్. ఐ.సి.,రైల్వే లను ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని మంత్రి మండిపడ్డారు.
మును గోడ్ ఎన్నికల సందర్భంగా చెప్పిన విధంగా మర్రి గూడ గ్రామం లో సి.సి.రోడ్లు,మురికి కాలువల నిర్మాణం కు 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముస్లిం లకు ఖబరిస్తాన్ కు పోయే దారి ఏర్పాటు సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. సగం లో నిర్మాణం ఆగిన ఎస్.సి. కమ్యునిటీ హాల్ నిర్మాణం కు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. లూజ్ పోల్ లు,మిడిల్ పోల్ లు,రెండు ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు సమస్య పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఎస్. ఈ. ని ఆదేశించారు. కొన్ని మిగిలిన పెన్షన్ లు మండలం లో,గ్రామం లో మంజూరు చేస్తామని చెప్పారు.
శివన్న గూడెం రిజర్వాయర్ శివన్న గూడెం, లక్ష్మణా పురం,చర్ల గూడెం నిర్వాసితులకు ప్లాట్ లకు భూమి గుర్తించి నట్లు,శివన్న గూడెం రిజర్వాయర్ పరిధిలో సమస్యలు పరిష్కరించేందుకు నాలుగు రోజుల్లో ఆర్థిక శాఖ,ఇరిగేషన్ శాఖ,అధికారులతో హైద్రాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసి చర్చించ నున్నట్లు తెలిపారు. బోర్ బావి ల దగ్గర మీటర్ లు పెట్ట లేదని సంవత్సరం కు 6 వేల కోట్ల రూ లు,గత రెండు సంవత్సరం లు గా 12 వేల కోట్ల రూ లు రూ.లు,5 సం ల లో కేంద్ర ప్రభుత్వం 30 వేల కోట్ల రూ.లు నిధులు బంద్ చేసిందని అన్నారు. కరోనా సంక్షోభం లో కూడా పెన్షన్ లు,రైతు బంధు ఆన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు కొనసాగించినట్లు తెలిపారు.
జనవరి 18 నుండి రాష్ట్రం లో గ్రామ గ్రామాన 300 కోట్ల రూ.లు ఖర్చు పెట్టే కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ రాష్టం లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల పట్ల ప్రజలకు విశ్వాసం పెరిగిందని అన్నారు. తెలంగాణ రాష్టం సరిహద్దు రాష్ట్రాల ప్రజలు,దేశం నుండి రాష్ట్రం లోని ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వస్తున్నారని ఆయన అన్నారు.గతం లో గుండె సంబంధిత సమస్య కు తమిళనాడుకు వెళ్ళే వారని , సిఎం కెసిఆర్ వైద్య రంగం లో తీసుకు వచ్చిన నిర్ణయాలు, మార్పుల కారణంగా ప్రజలకు వైద్యరంగం పై నమ్మకం పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో లివర్, కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ గుండె సంబంధిత వ్యాధులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందు బాటు లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏ రాష్ట్రం లో కూడా అమలు కావడం లేదని అన్నారు.రాష్ట్రం లో అమలు చేస్తున్న రైతు బంధు,24 గంటల ఉచిత విద్యుత్ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలు అమలు చేయాలని కోరుతున్నట్లు,దేశం లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గురించి చర్చించు కుంటున్నరని అన్నారు. ఏ.పి.ప్రజలు,దేశం యావత్తూ కె.చంద్ర శేఖర్ రావు నాయకత్వం కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశం లో తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,వైద్య విధాన కమిషనర్ డా.అజయ్ కుమార్,శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తదితరులు పాల్గొన్నారు.