Wednesday, January 22, 2025

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు

- Advertisement -
- Advertisement -

Minister harish rao inaugurated the Primary Health Center

మోతె: బాల్కొండ నియోజకవర్గం మోతె గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డిలు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతా మహంతి, జెడ్పీ చైర్మన్ విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… మీరు నిజాంబాద్ పార్టీ ఇన్చార్జిగా ఉన్నప్పటినుంచి నాకు అత్యంత సన్నిహితులు కీర్తిశేషులు సురేందర్ రెడ్డి. ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం, కుమారుడు ప్రశాంత్ రెడ్డి తో కలిసి గ్రామానికి రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. తెలంగాణ వస్తుందో రాదో అన్న రోజుల్లో గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా పార్టీకి తీర్మానం చేసి మట్టి మూటగట్టి తెలంగాణ భవన్ కు పంపించిన చైతన్యవంతమైన గ్రామం మోతె. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందు ముందున్న సి సెక్షన్ లో రాష్ట్రం వెనుకబడి ఉందిని మంత్రి పేర్కొన్నారు.

తల్లికి బిడ్డకి ఆరోగ్యాన్ని నష్టం కలిగించే సి సెక్షన్ సిజరిన్ ఆపరేషన్ అవసరం ఉంటే తప్ప తీసుకోకుండా గ్రామగ్రామాన అవగాహన కల్పిస్తున్నారు. మీరందరూ ముందుకొచ్చి నార్మల్ డెలివరీ ఆపరేషన్ చేయించుకోండి. 34 శాతం పిల్లలకు మాత్రమే మొదటి గంటలో తల్లిపాలు అందుతున్నాయి. 66 శాతం మందికి మొదటి గంటలో తల్లిపాలు దూరమైపోతుంది. ఇందుకు సీ సెక్షన్ ఆపరేషన్లే కారణం. మొదటి గంట తల్లిపాలు తాగిన పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారు చురుగ్గా ఉంటారు.
మోతే లో 15 డెలివరీలు అయితే 12 పెద్దాపరేషన్ లు మూడు మాత్రమే నార్మల్ డెలివరీ అయ్యాయి. డాక్టర్ల అవసరం అనుకుంటే తప్ప ఆపరేషన్లు చేయకుండా పిల్లల భవిష్యత్తును తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలి. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కంటే మెరుగైన సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్ డెలివరీ అయితే 12000 వస్తాయి ,తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటది ..ప్రైవేట్ హాస్పిటల్ లో పైసలు పోతాయి. మీరే డబ్బులు ఎదురు పెట్టుకోవాలి. తెలంగాణలో ఇంటింటికి వచ్చి ఆరోగ్య సర్వే చేసి షుగర్ కి, బిపి కి ప్రతి ఒక్క వ్యాధికి ఎన్ సి డి కిట్ ఇంటికి వచ్చి నెలకు సరిపడా గోలీలు మందులు ప్రభుత్వం ఇవ్వనుందని ఆయన వివరించారు. షుగర్ బీపీ వ్యాధులకు సరైన మందులు వాడితే మంచి ఆరోగ్యంగా జీవితకాలం ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద దేశ యువతను అంధకారంలోకి నెట్టిన ప్రయత్నం చేస్తుంది. బీజేపి దేశం కోసం సేవ చేసే ఆర్మీ జవాన్లపైన కూడా రాజకీయం చేస్తోందని మంత్రి విమర్శించారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే పనిలో భాగంగా బిజెపి ఆర్మీ ఉద్యోగాలను కూడా ప్రవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది. అగ్నిపథ్ పథకము సరికాదని ప్రశ్నించిన నిరుద్యోగ యువతపై కాల్పులు జరిపి బిజెపి తెలంగాణ బిడ్డను పొట్టనబెట్టుకున్నదని మండిపడ్డారు. సికింద్రాబాద్ లో జరిగిన ఘటన టిఆర్ఎస్ పార్టీ వల్ల జరిగిందని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. నేను బండి సంజయ్ ను ఒక్కటే అడుగుతున్న. మరి మీరు పాలించే రాష్ట్రాల్లో కూడా నిరసనలు, ధర్నాలు, దాడులు జరుగుతున్నాయి. అవి మీరు చేయించుకుంటున్నారా…ప్రజలకు సమాధానం ఇవ్వాలి. ప్రజల ఆకాంక్షలు ప్రజల ఆశలు అర్థం గాని ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం… స్వార్థంతో తెచ్చే బీజేపీ పథకాలు అర్థం కాలేదని ఎదురు దాడి చేస్తున్నారు. చిన్న మాట ప్రజలకు ఇచ్చినా… నిలబెట్టుకునే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. రూ. 2000  పెన్షన్, ఆడపిల్లకు కల్యాణలక్ష్మి, రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చినాము, రైతుబంధు దళిత బంధు ఇచ్చినాము దేశంలోనే సంక్షేమ రంగంలో తెలంగాణ ను మించిన రాష్ట్రం లేదని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News