Friday, December 20, 2024

ఈహెచ్ఎస్ ద్వారా త్వరలో క్యాష్ లెస్ హెల్త్ సర్వీసెస్

- Advertisement -
- Advertisement -

గజ్వేల్ జోన్: ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వమే కాకుం డా అత్యధిక వేతనాలు అందిస్తున్న ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్రభుత్వమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు.శుక్రవారం సిద్దిపేట జి ల్లా గజ్వేల్ పట్టణంలో పలు అభివృద్ధ్ది పథకాలను ప్రారంభించిన మంత్రి టిఎన్జీఓల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హెచ్‌ఎస్ ద్వారా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులకు క్యాష్‌లెస్ హెల్త్ సేవలను అమలులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సిఎం కెసిఆర్ ప్రభుత్వంలో అవినీతికి తావులేదన్నారు. పారదర్శకంగా పనిచేస్తున్నామని, దేశానికి దిక్చూచిలా ప్రభుత్వ ఉ ద్యోగులకు అండగా ఉంటున్నామని ఆయన అన్నా రు. పక్క రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉద్యోగులకు టి ఏ, డిఏ కొర్రీలు పెడుతూ ఉద్యోగులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయని, కానీ తెలంగాణ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వగా చెప్పిన నాయకుడు సిఎం కెసిఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సంక్షేమం, అభివృద్ది ఎంత జరుగుతున్నదో ప్రజల్లో చర్చకు పెట్టాలని ఉద్యోగులకు మంత్రి హరీశ్‌రావు పిలుపు నిచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని చో ట్ల టిఎన్జీఓ భవనాల నిర్మాణాలకు నిధులు మం జూరు చేశామని మంత్రి తెలిపారు. మనమంతా కెసిఆర్‌కు అండగా ఉండాలని మంత్రి హరీష్ రావు ఉ ద్యోగులకు పిలుపునిచ్చారు. అంతకు ముందు గ జ్వేల్ పట్టణంలో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన డా. బిఆర్ అంబేద్కర్ ఫంక్షన్ హాల్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల ఎత్తైన డా. బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సిఎం కెసిఆర్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా రాష్ట్ర సచివాలయానికి బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టామన్నారు. ఈ సమావేశంలో కళ్యాణ లక్ష్మి, సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు మంత్రి పంపిణీ చేశారు.

గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో భూసార పరీక్షా కేంద్రాన్ని ఎఎంసి ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్‌చే మంత్రి హరీశ్‌రావు ప్రారంభింప చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సేవలో సిఎం కెసిఆర్‌ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఉచిత విద్యుత్, కాళేశ్వరం సాగునీరు, రైతు బంధు, సకాలంలో ఎరువులు విత్తనాలు అందించ టం వంటి సేవలు రైతులకు అందిస్తున్నామనర్నా రు. ఈ కారణంలా పంటల సాగు విస్తీర్ణం గణనీయ ంగా పెరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు ప్రయోజనం కలిగిందన్నారు. పామాయిల్ తోటల పెంపకానికి రైతుల్లో అవగాహన క ల్పించి తగిన ప్రోత్సాహం కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.భూమిలో మంచి పంటల దిగుబడికి అవసరమైన భూసార పరీక్షలు స్థానికంగా అందుబాటులోకి తేవాలని ఈ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.

కాగా శుక్రవారం సంగాపూర్ , తూ ప్రాన్ వై జంక్షన్‌ల వద్ద ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. గజ్వేల్ = ప్రజ్ఞాపూర్‌లో బిసి కమ్యూనిటీ హాల్‌ను , ముస్లిం మైనారిటీ స్మశాన వాటికను ఆయన ప్రారంభించారు. పట్టణంలోని సంగాపూర్ రోడ్డులో బస్తీ దవాఖానను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి వైద్యలు బిపి పరీక్షలు చేశారు. శుక్రవారం జరిగిన పలు కార్యక్రమాలలో జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా శర్మ,ఎమ్మెల్సీ డా. యాదవ రెడ్డి,ఎఫ్‌డిసి చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ఎంఐ కార్పొరేషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,ఎఎంసి ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్,మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు ఎన్సీ రాజమౌళి గుప్తా, జకీయొద్దీన్,తన్‌జీముల్ మసాజిద్ కమిటీ అధ్యక్షుడు యూసుఫుద్దీన్, మైనారిటీ నాయకులు సయ్యద్ మతిన్,విరాసత్ అలి, హజ్ కమిటీ సభ్యుడు జాఫర్ ఖాన్,మున్సిపల్ కౌన్సిలర్లు, ఆత్మ కమిటీ ఛైర్మన్ ఊడెం క్రిష్ణారెడ్డి, అంబేద్కర్ సంఘాల నాయకులు, పలువురు దళిత సంఘాదల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News