Saturday, December 21, 2024

దళిత ‘వెలుగు’

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao inaugurating Dalitha bandhu in Gajwel

దళితబంధు ఒక పథకం కాదు…అదో ఉద్యమం

దళితుల జీవితాల్లో నిజమైన వెలుగు నింపాలనే ఈ పథకాన్ని సిఎం కెసిఆర్ తీసుకొచ్చారు:
గజ్వేల్‌లో దళితబంధును ప్రారంభిస్తూ మంత్రి హరీష్‌రావు

మన తెలంగాణ/గజ్వేల్ : దళితుల జీవితాల్లో నిజమైన వెలుగులు నింపాలన్న ఉద్దేశంతోనే సిఎం కెసిఆర్ దళితబంధు పథకాన్ని తెచ్చారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీశ్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో దళితబంధు పథకాన్ని మంత్రి అట్టహాసంగా ప్రారంభించారు. పట్టణంలోని ఐఓసి సమీపంలోని మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కెసిఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామానికి చెందిన 129మంది లబ్ధిదారులకు సుమారు రూ.10.26కోట్ల విలువైన ఆస్తులను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రాంల కలలను సాకారం చేసేందుకు దళితబంధు పథకానికి కెసిఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో దళితబంధుకోసం రూ.17వేల8వందల కోట్ల నిధులు కేటాయించామన్నారు. కేవలం ఒక పథకానికి ఇంత భారీమొత్తంలో నిధులు కేటాయించటం దేశ చరిత్రలోనే ప్రథమమన్నారు.

విద్య, ఉద్యోగాలలోనే కాకుండా ప్రభుత్వం ఇచ్చే లైసెన్సులు, కాంట్రాక్ట్‌లలో కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, విధాన నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. విద్యాపరంగా దళితులు ఎదగాలన్న తపనతో సిఎం చేస్తున్న కృషి ప్రశంసనీయమని, ఈ వర్గాల కోసం 50మహిళా గురుకుల కాలేజీలు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గతంలో నీటి పారుదల శాఖ టెండర్లలో 21శాతం ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయించిన విధంగానే, వైన్‌షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ, డైట్ ఏజెన్సీల్లో 16 శాతం దళితులకు కేటాయిస్తున్నామని హరీశ్ అన్నారు. తన దత్తత గ్రామమైన కొల్లూరులో సొంత స్థలాలున్న 2వందల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కొల్గూరులో ఫంక్షన్ హాల్, డైనింగ్ హాల్ తో పాటు పెండింగ్‌లో ఉన్న రజక భవనం, సటిజన్ సర్వీస్ సెంటర్ తదితర పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.

అనంతరం దళితబంధు లబ్ధిదారులకు ట్రాక్టర్లు, టెంపోలు, హార్‌వెస్టర్, ట్రాలీ ఆటోలు, ఇతర కొన్ని ఆస్తులకు సంబంధించిన మంజూరు పత్రాలను ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, అదనపు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, జడ్పీ చైర్మన్ రోజా రాధాక్రిష్ణ శర్మ, గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, ఎంపిపి దాసరి అమరావతి, జడ్పీటిసి పంగ మల్లేశం, ఎఎంసి చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, కొల్గూరు సర్పంచ్ మల్లం రాజు, ఎంపిటిసి జ్యోతి స్వామి, పాక్స్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి ,వైస్ ఎంపిపి కృష్ణ, మునిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, పలువురు దళిత నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News