Sunday, January 26, 2025

విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టెల మంత్రి హరీష్ రావు వినూత్న కార్యక్రమం..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా పదవ తరగతి ఫలితాల్లో గత సంవత్సరం రాష్ట్రంలో నే మొదటి స్థానము లో నిలిచింది. అదే స్ఫూర్తితో గత 3 నెలల నుండే మంత్రి హరీష్ రావు జిల్లా స్థాయిలోను సమీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థుల తల్లీ తండ్రులకు నేరుగా ఉత్తరం వ్రాయడం తో పాటు వారి ని ఇంటి వద్ద చదివించేల తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేల కాన్ఫరెన్స్ కూడా నిర్వహించ బోతున్నారు. ఇలా గత స్పూర్తితో ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా అగ్రస్థానంలో నిలిచేల మంత్రి ప్రణాలికలు రూపొందిస్తు ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష లు నిర్వహిస్తున్నారు.

సీఎం కేసీఆర్ జిల్లా అన్నింటి లో ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట జిల్లా 10వ తరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాల ల్లో ఆల్ఫారం ఇస్తూ సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.అదే పంథాలో వారిలో మరింత మేధస్సు పదును పెట్టి పదవ తరగతి వారి భవితకు ఎంతో పునాది అని ఆ దిశగా పై చదివులకు ఈ పదవ తరగతి స్పూర్తి కావాలని వారు పాఠశాల లోనే కాదు ఇంటి వద్ద కూడా చదువు కొనే ఒక కొత్త కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్ట ఉన్నారు.. త్వరలోనే ఆ కార్యక్రమం పై పదవ తరగతి జిల్లా స్థాయి సమీక్ష లో ప్రకటించన్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News