సదాశివపేట: ధరణి రిజిస్ట్రేషన్‌లతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని, ప్రభుత్వం తీసుకు వచ్చిన నిర్ణయంతో రైతుల భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సదాశివపేటలోని తహశీల్దార్ కార్యాలయాన్నీ మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి, భూ రిజిస్ట్రేషన్‌లపై రైతులను మంత్రి హరీశ్‌రావు అడిగి తెలుసుకున్నారు. ధరణితో రైతులకు మేలు జరుగుతుందని, భూముల సమస్య త్వరగా పరిష్కారం దొరకుతుందని రైతులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.
కొంత మంది ధరణిని తీసివేయాలని అంటున్నారని మంత్రి రైతులను అడగ్గా ధరణితో భూ సమస్యలు వెంటనే పరిష్కారం దొరుకుతుందని, భూములు కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్‌లు వెంటనే జరుగుతున్నాయని రైతులు మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, కలెక్టర్ శరత్, తహశీల్దార్ మనోహర్ చక్రవర్తి, డిప్యూటీ తహశీల్దార్ వీరేశం తదితరులున్నారు.