Monday, January 20, 2025

కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: అవసరమయ్యే వారికి తక్షణం రీడింగ్‌ గ్లాస్‌లు పంపిణీ చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పట్టణంలోని 43వ వార్డులో బాలికల హైస్కూలులో రెండవ విడత కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్య‌క్ర‌మం ఎలా ఉంద‌ని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధుల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంద‌ని వారు మంత్రికి వివ‌రించారు.

కంటి వెలుగు శిబిరం వివ‌రాలు, ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. కండ్ల‌ద్దాల పంపిణీ చేశారనే విష‌యాల‌ను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రిస్ర్కిప్షన్‌ అద్ధాలు అవసర మయ్యే వారి వివరాలను యాప్‌లో నమోదు చేసినట్లైయితే 15 రోజుల్లోగా లబ్ధిదారులకు అందుతాయని సూచించారు. కంటి పరీక్షల కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని స్థానిక నిర్వాహక మున్సిపల్, వైద్య సిబ్బందిని ఆరోగ్య మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, వైద్య బృందం పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News