Monday, December 23, 2024

రైల్వే లైన్‌ పనులను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

కొత్తపల్లి : సిద్దిపేట-సిరిసిల్లా రైల్వే లైన్ నిర్మాణ పనులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు గురువారం పరిశీలించారు. మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు 151.4 కిలో మీటర్ల మేర రైల్వే లైన్‌ పనులు ఉన్నాయి. మనోహారబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు 32 కిలోమీటర్ల రైల్వే లైన్‌ పనులు పూర్తయ్యాయి. గజ్వేల్ వరకూ రైలు రావడం, రైతులకు మేలు జరిగేలా రేక్ పాయింట్ ఏర్పాటు కావడం చకచకా జరిగిపోయాయి. మరో వైపు గజ్వేల్‌-దుద్దెడ వరకు 32.1 కిలో మీటర్లు సైతం ట్రాక్ నిర్మాణం పూర్తయ్యింది. కుకునూరుపల్లి-దుద్దేడ వరకూ రైల్వే శాఖ అధికారులు ట్రయల్ రన్ జరిగింది. ఇక మిగిలిన దుద్దెడ-సిద్ధిపేట మధ్య ఎర్త్‌వర్క్‌ పూర్తయ్యింది.

దుద్దెడ-సిద్ధిపేట-సిరిసిల్ల 48.65 కిలోమీటర్ల ట్రాక్‌ నిర్మాణ పనులు పురోగతితో శరవేగంగా జరుగుతున్నాయి. వీటిలో దుద్దెడ-సిద్ధిపేట రైల్వే స్టేషన్ వరకూ రైల్వే ట్రాక్ దాదాపు పూర్తయ్యింది. అలాగే సిద్దిపేట -సిరిసిల్ల నుంచి కొత్తపల్లి వరకు 38.6 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ పనులు చేపట్టాల్సి ఉన్నది. మరోవైపు దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు ట్రాక్‌ నిర్మాణ పనులు పూర్తయి మరో 60 రోజులలో సిద్ధిపేట రైల్వే స్టేషన్‌ వరకూ రైల్వే సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహణ ఉంటుంది. ఈ క్రమంలో సిద్దిపేట -సిరిసిల్లా రైల్వే లైన్ నిర్మాణ పనులకు రూ.500 కోట్లు కేటాయింపు చేసినట్లు టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యిందని, రైల్వే లైన్ పనులు వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News