Monday, December 23, 2024

డీఎస్సీ నోటిఫికేషన్ రాకముందే లాంగ్ టర్మ్ శిక్షణ ఇప్పిస్తాం

- Advertisement -
- Advertisement -

Minister Harish rao interact with TET qualified candidates

 

సిద్ధిపేట : పొన్నాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇటీవల టెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ముఖాముఖి నిర్వహించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… డీఎస్సీ నోటిఫికేషన్ రాకముందే లాంగ్ టర్మ్ శిక్షణ ఇప్పిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్షలో 32 శాతం ఉత్తీర్ణత అయితే, కేవలం సిద్ధిపేటలో నిర్వహించిన కేసీఆర్ ఉచిత శిక్షణ కేంద్రంలో 82శాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ఇందులో 618 మంది అభ్యర్థులకు గాను 517 పాస్ అయ్యారు. త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ రాబోతున్నది. దానికి సైతం మీరంతా సంసిద్ధంగా ఉండాలని గ్రూప్స్-4 కోచింగ్ ఉచితంగా ఇప్పిస్తానని మంత్రి వెల్లడించారు. మీరు ఉద్యోగాలు సాధించినప్పుడే ఈ కేసీఆర్ శిక్షణకు నిజమైన సార్థకత లభిస్తోందన్నారు. ఈసారి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు చాలా అదృష్టవంతులు. సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశారని మంత్రి తెలిపారు. 317 జీఓను రద్దు చేయాలని, దాని అంతర్యం తెలియకుండా.. ప్రతిపక్షాలు ఆందోళన చేయడం సిగ్గుచేటన్నారు.

బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల 50వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాదికే లక్ష 50 వేలు ఉద్యోగాలకు ఇప్పటికే లక్షా 30 ఉద్యోగాలు ఇచ్చామని, ఈ యేటా మరో 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం, యువతను నిర్వీర్యం, మోసం చేయడానికే ఈ పథకం తెచ్చారని మంత్రి విమర్శించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమ్మడం తప్ప కొత్తగా తెచ్చేది ఏమీ లేదన్నారు. ఏ రంగానికి కూడా బీజేపీ ప్రభుత్వం మేలు చేయలేదని, రూపాయి విలువ పతనమై.. దేశంలో 8.7 శాతం నిరుద్యోగ సమస్య ఉన్నదని మంత్రి హరీశ్ తెలిపారు.  ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడంలో బీజేపీ ప్రభుత్వానికి డాక్టరేట్ ఇవ్వాలని పేర్కొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదు.  సిద్దిపేట అంతా నా కుటుంబంగా భావించి అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News