Wednesday, January 22, 2025

‘సంక్షేమం’గా ‘సాగు’దాం

- Advertisement -
- Advertisement -
Minister Harish Rao introduced budget in Legislative Assembly
కేంద్రం తీరు కాళ్లల్ల ప్రగతిశీల రాష్ట్రాలను నిరుత్సాహ పరుస్తోంది : మంత్రి హరీశ్‌రావు
రాష్ట్ర పెట్టుబడి          రూ.2,56,958.51 కోట్లు
రెవెన్యూ వ్యయం      రూ.1,89,274.82 కోట్లు
పెట్టుబడి వ్యయం        రూ.29,728.44 కోట్లు
ద్రవ్యలోటు            రూ.52,167.21 కోట్లు
వ్యవసాయం    రూ.24,254 కోట్లు
దళితబంధు        రూ.17,700 కోట్లు
నేతన్న బీమా
సొంత స్థలంలో ఇంటికి        రూ.3లక్షలు

మన తెలంగాణ/ హైదరాబాద్ : బడ్జెట్ అంటే అంకెల సముదాయం కాదు.. ప్రజల ఆశల, ఆకాంక్షల వ్యక్తీకరణ అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభు త్వంతో పాటు వివిధ రాష్ట్రాలు కోవిడ్ సంక్షోభంతో ఆర్థికంగా కుదేలు నేపథ్యంలో పటిష్టమైన ఆర్థిక క్రమ శిక్షణ, నిర్వహణతో తెలంగాణ రాష్ట్రం త్వరగా కోలుకున్నట్లు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ నిరూపించింది. వార్షిక బడ్జెట్‌ను రూ.2,56,958. 51కోట్ల వ్యయంగా ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయంగా రూ.1,89,274.82 కోట్ల్లు కాగా, క్యాపిటల్ వ్యయం 29,728.44గా ప్రతిపాదించారు.

కేంద్ర ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా.. మెరుగైన ఆర్థిక విధానాలతో రెవెన్యూ రాబడులతో అభివృద్ధి, సంక్షేమమే లక్షంగా ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ రూపొం దించింది. ఏడాది చివరికి 3,754 కోట్ల రూపాయలు రె వెన్యూ మిగులు ఉంటుందని అంచనా వేశారు. ద్రవ్య లోటు 52,167.21 కోట్ల రూపాయలు ఉంటుందని అం చనా వేశారు. ఆర్థికశాఖ మంత్రిగా హరీష్‌రావు శాసనసభ లో మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పారదర్శక ఆర్థిక విధానాలతో రాబడిని పెంచుకున్నామన్నారు. సమైక్య రా ష్ట్రంలో తెలంగాణ అగచాట్లు పడిందని గుర్తు చేశారు. పో రాటం దశ నుంచి ఆవిర్భావం వరకూ తెలంగాణ కొత్త రూపం సంతరించుకుందని తెలిపారు. సవాళ్లు, క్లిష్టమమై న సమస్యలను అధిగమించామని చెప్పారు. రాష్ట్రంలో ఇ ప్పుడు విద్యుత్ కోతలు, ఆకలి చావులు లేవన్నారు. దేశం లో తెలంగాణ ఓ టార్చ్ బేరర్ అని తెలిపారు. ఆసరా, రైతు బంధులా ఏ పథకమైనా లబ్ధిదారులకే చేరుతుందన్నారు.

ప్రగతిశీల రాష్ట్రాలను కేంద్రం నిరుత్సాహ పరుస్తోందని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచే కేంద్రం దాడి మొదలైందన్నారు. ఏడు మండలాల ను ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా బదలాయించిందని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. కేంద్రం తీరు.. కాళ్లల కట్టె పె ట్టినట్లు ఉందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ ఆవిర్భావం చర్చ జరిగిన ప్రతిసారి ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అని పదే పదే వ్యాఖ్యానిస్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణవాసు ల మనో భావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఐటి ఐఆర్‌ను అమలు చేయడం లేదని, రాష్ట్రంలో ఉ మ్మడి తొమ్మిది జిల్లాకు రావాల్సిన వెనుకబడిన నిధులు ఇవ్వడం లేదన్నారు. నీతి ఆయోగ్ సూ చించిన మిషన్ కాకతీయ, భగీరథకు నిధులు ఇ వ్వలేదన్నారు.

జహీరాబాద్‌లోని నిమ్జ్‌కు కేంద్రం వాటా రూ.500 కోట్లు ఇప్పటికి విడుదల చేయలే దన్నారు. 2021 సంవత్సరానికి రూ.723 కోట్లు ప్రత్యేక గ్రాంటుగా ఇవ్వాలని ఆర్థిక సంఘం సూ చించిన కేంద్రం బుట్టదాఖలు చేసిందన్నారు. రా ష్ట్రానికి ఇచ్చే నిర్ధిష్ట గ్రాంట్లు రూ.2362 కోట్లు విడుదల చేయలేదని గుర్తుచేశారు. అదే విధంగా సెక్టార్ స్సెసిఫిక్ గ్రాంట్లు 3024 కోట్లు ఇవ్వలేద న్నారు. కరోనతో దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎ దుర్కొన్నదో అందరికి తెలిసిన..కేంద్రం రాష్ట్రాలకు ఒక్క రూపాయ ఇవ్వలేదన్నారు. కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయంలో న్యాయం గా 41 శాతం రాష్ట్రాలకు రావాలి. శాతం గండి కొడుతూ 29.6 శాతం మాత్రమే నిధులు ఇస్తున్నారని మంత్రి చెప్పారు.

జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన దళితబంధు పథకం కోసం 17,700 కో ట్లు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఇప్పటికే నియోజకవర్గానికి వంద మంది చొప్పున మొత్తం 118 నియోజక వర్గాల్లో 11,800 కుటుంబాలకు దళిత బంధు ప థకం కింద ఆర్థిక సహాయం అందజేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు సభకు వివరించారు.

మన ఊరు.. మన బడికి రూ.3,497 కోట్లు

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా మ న ఊరు-.. మనబడి పథకం ప్రారంభించాం. రా ష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనను అందిస్తాం. 7,289 కోట్ల రూపా యలతో దశల వారీగా పాఠశాలల్లో 12 రకాల అ భివృద్ది పనులను ప్రభుత్వం చేపడుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 9,123 పాఠశాలల్లో 3,497 కోట్లతో అభివృద్ధి చేయనున్నాం. మహిళా విశ్వ విద్యాలయ ఏర్పాటుకు ఈ ఆర్థిక సంవత్సరంలో వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. అటవీ విశ్వవిద్యాలయానికి రూ.వంద కోట్లను కేటాయించామని మంత్రి చెప్పారు.

అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలు..

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ సంవత్సరం ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో వైద్యకళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. 2023 సంవత్సరంలో ఎనిమిది జిల్లాలైన మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో వైద్యకళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. వైద్య కళాశాలల ఏర్పాటుకు వెయ్యికోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించామని మంత్రి తెలిపారు.ప్రభుత్వ దవాఖానల్లో డైట్ ఛార్జీలను రూ.56 నుంచి రూ. 112కు పెంచాం. ఇందు కోసం రూ. 43.5 కోట్ల వ్యయం చేయనున్నాం. 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగితో పాటు సహాయకులకు రెండు పూటల భోజనానికి వీలుగా 38.66 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. బెడ్ ఒక్కొటికి పారిశుద్ద్య నిర్వహణను రూ.7500 రూపాయలకు పెంచుతూ.. రూ.338 కోట్ల వ్యయం చేయనున్నదన్నారు. 61 మార్చురీల ఆధునీకరణకు 32.50 కోట్ల మంజూరు చేశామని మంత్రి తెలిపారు.

వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యం..

పామాయిల్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. 2.5 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు వేయి కోట్ల రూపాయలను కేటాయించామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు రైతుబంధు పథకం కింద రూ.50,448 కోట్లను 63 లక్షల మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందన్నారు. రైతుబీమాతో రైతు మృతి చెందితే రూ.5 లక్షలు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 75 వేల కుటుంబాలకు 3,775 కోట్ల రూపాయలను రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందజేసిందన్నారు. ఈ వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి మొత్తంగా 24254 కోట్ల రూపాయలు కేటాయించాం. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది రూ.75 వేల లోపు రుణాలను మాఫీ చేస్తామని మంత్రి తెలిపారు.

కొత్త వారికి అసరాగా నిలుస్తాం…

వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు విధించిన వయో పరిమితిని 57 ఏళ్లకు ప్రభుత్వం తగ్గించిందని, సడలించిన వయో పరిమితి మేరకు కొత్త లబ్దిదారులకు ఆసరా పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఇందుకు బడ్జెట్‌లో రూ. 11,728 కోట్ల ప్రతిపాదించామని తెలిపారు. సొంత స్థలాలు కలిగిన వారు తమ స్థలంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకోవడం కోసం రూ.3 లక్షల రూపాయల చొప్పున అందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి , సొంత స్థలంలో డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం అందజేస్తుందన్నారు. నియోజకవర్గానికి మూడువేల ఇండ్ల చొప్పున కేటాయిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ.12,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేటాయించింది. రైతులకు వ్యవసాయానికి పెట్టుబడిగా గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో రూ.50 వేల కోట్లు అందజేశామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రైతులు మరణిస్తే రూ.5 లక్షలు అందజేస్తున్నాం. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ ద్వారా 10 లక్షల మందికి లబ్ధి చేకూర్చాం. మరో పది లక్షల మంది తల్లులకు కెసిఆర్ కిట్లను అందజేశాం. 46,600.50 కోట్లు ఆసరా పింఛన్లకు ఎనిమిది సంవత్సరాల అందజేశామన్నారు.

నేతన్న బీమా.. బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు

రైతుబంధులా చేనేత కార్మికులకు ఈ ఏడాది నుంచి కొత్త పథకం ప్రవేశపెడుతామన్నారు. రైతుబీమా తరహా నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయాలని ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బడ్జెట్‌లో గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం వేయి కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. గీత కార్మికుల సంక్షేమం కోసం వంద కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం ప్రవేశపెట్టనున్నట్లు , అదే విధంగా లక్ష మందికి మోటార్ సైకిళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. గిరిజన నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్‌టి ఎస్‌డిఎఫ్ నిధుల నుంచి వేయి కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేటాయింమని వెల్లడించారు. గిరిజన, ఆదివాస గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 600 కోట్లు వ్యయం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

పోషకాహారం కిట్ల పంపిణీ…

బాలింతలలో రక్తహీనత సమస్య నివారించేందుకు ‘కెసిఆర్ నూట్రీషియన్ కిట్’ పేరుతో పోషకాహారంతో కూడిన కిట్‌లను పంపిణీ చేయనున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ కిట్స్ ద్వారా ప్రతి సంవత్సరం లక్షా 25 వేల మంది మహిళలు ప్రయోజనం పొందుతారని వెల్లడించారు. పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజనిక్ కిట్స్ ప్రభుత్వం పంపిణీ చేస్తామని, ఈ పథకంతో 7 లక్షల మంది బాలికలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు.

గ్రేటర్ శివారుల్లో తాగునీటికి నిధులు..

ఔటర్ రింగ్ రోడ్డు సమీప గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి కొరత తీర్చేందుకు రూ.1200 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. గ్రేటర్ పరిధిలో 1736 దేవాలయాల్లో అర్చకులకు ధూపదీప నైవేద్య పథకంలో రూ. 12.50 కోట్లు అందజేయనున్నామని తెలిపారు. రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు రూ. 1542 కోట్లు, మెట్రో రైలును పాతబస్తీలో అనుసంధానించేందుకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రేటర్ పరిధిలో రోజుకు 20 లీటర్ల ఉచితంగా నీరందించే పథకానికి రూ.300 కోట్ల కేటాయించామని మంత్రి వెల్లడించారు.

పర్యాటక.. పరిశ్రమలకు..

కాళేశ్వరం టూరిజం సర్య్యూట్‌కు రూ.750 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అర్బన్ మిషన్ భగీరథకు ఈ బడ్దెట్‌లో 800 కోట్లు కేటాయించారు. విమానాశ్రయానికి మెట్రో కనెక్టవిటీకి ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లు ప్రతిపాదించాం. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మరో 1500 కోట్లు వ్యయం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా రూ.2142 కోట్లు , పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కింద 190 కోట్లను బడ్జెట్‌లో కేటాయించామని వెల్లడించారు. పావలా వడ్డీ స్కీంను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు , చిన్న తరహా పరిశ్రమలను, మహిళలు ఏర్పాటు చేసి విధంగా ప్రోత్సహించడానికి 187 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కి ఈ బడ్జెట్ లో 1500 కోట్లు కేటాయించినట్లు మంత్రి సభకు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News