సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని 16వ వార్డ్ లో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొని 40లక్షల సిసి రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. అదనపు కలెక్టర్ మూజమిల్ ఖాన్, మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి లో రాష్ట్రానికె ఆదర్శంగా నిలిచింది మన సిద్దిపేట.. పట్టణ ప్రగతి లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాం. పట్టణ ప్రజల ఐక్యత.. భాగస్వామ్యం తో ఏదైనా సాధ్యం అవుతుంది. అందుకు నిదర్శనం ఉత్తమ అవార్డ్ అన్నారు. ఇదే స్ఫూర్తితో పట్టణ ప్రగతిలో ఆదర్శంగా నిలుద్దామని పేర్కొన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో మురికి కాలువల బాధ తప్పిందని మంత్రి తెలిపారు.
ఇందిరమ్మ కాలనీ అధ్బుతంగా అభివృద్ధి జరిగింది. 30కోట్లతో ఎల్లమ్మ గుడి నుండి రామంచ వరకు పోర్ లైన్ రోడ్ బట్టర్ ఫ్లై లైట్స్ ఏర్పాటు చేశామన్నారు. సిద్దిపేట లో గుణాత్మకమైన మార్పు వచ్చింది. ఒకనాడు సిద్దిపేట త్రాగునీటి తో ఇబ్బంది పడింది. ఈ వార్డ్ లో ఉన్న వారికి పాత ఇండ్ల స్థలంలో 3లక్షలతో ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తామని మంత్రి హరీశ్ చెప్పారు. ఈ ఏడాది నుండి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ఉంటుంది, తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ కి పిల్లలను పంపవద్దని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల కంటే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నాము. క్యాన్సర్ రోగులకు, గుండె సంబంధిత రోగులకు త్వరలో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తామన్నారు. చివరి శ్వాస వరకు మీ ఆశీర్వాదం తో పనిచేస్తానన్న మంత్రి చెట్లు కొట్టవద్దు- చెత్త రోడ్లపై వేయవద్దు ప్రజలకు సూచించారు.