Sunday, December 22, 2024

నిర్మలా సీతారామన్‌కు మంత్రి హరీశ్‌రావు లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీం (సిఎస్‌ఎస్) కింద 2014- 15లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు రూ. 495.20 కోట్లు పొరబాటున ఎపికి జమ చేశారని, వాటిని తిరిగి ఇప్పించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి హరీశ్ రావు మరోసారి లేఖ రాశారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణకు రావాల్సిన నిధులు ఇప్పించాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి సంవత్సరంలో (2014 -15) కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారని, అయినా పొరపాటున మొత్తం సిఎస్‌ఎస్ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారని గుర్తు చేశారు. దీంతో తెలంగాణ నష్ట పోయిందరి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లిందని పేర్కొన్నారు.

ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా రూ. 495.20 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదని అన్నారు. ఈ విషయంపై అనేక సార్లు కేంద్రానికి లేఖలు రాశామని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌కు పొరబాటున విడుదల చేసిన రూ.495.20 కోట్ల మొత్తాన్ని తిరిగి తెలంగాణకు విడుదల చేసేలా కృషి చేయాలని అన్నారు. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని తెలంగాణ జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని నిర్మలా సీతారామన్‌ను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News