Monday, January 27, 2025

రైతుబజార్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట  : మీకు అనుకున్న గిరాకీ గిట్టుబాటు అవుతుందా.. రైతుబజార్‌లో సౌలత్‌లు ఎట్లా ఉన్నాయని, ఇంకేమైన కావాలన్న అంటూ రైతులతో మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముచ్చటించారు. నిత్యం వేలాది మంది వచ్చి పోయే రైతుబజార్‌ను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పరిశుభ్రత పాటించని ప్రదేశాన్ని చూపుతూ ఇట్లా అయితే ఎలా అంటూ ఎస్టేట్ అధికారి ప్రభాకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం పట్టణంలోని రైతు బజా రును ఆకస్మికంగా సందర్శిస్తూ ప్లోర్ కలియ తిరుగుతూ విక్రయదారులైన రైతులతో మాటమంతి కలిపారు.

ములక్కాయలు విక్రయిస్తున్న ఓ మహిళా రై తుతో ముచ్చటిస్తూ గిట్టుబాటు అవుతుంది. అంటు ఆరా తీశారు. కిలో రూ. 50 ధర పలుకుతుందని రైతు వివరించింది. పది ఎకరాల్లో వస్తుందని ఈ ప్రాంతంలో నీళ్లు బాగానే ఉన్నాయని సంబురంగా చెప్పింది. నేను ఐదు ఎకరాలు ము లక్కాయ పంట పెడతానని మంత్రి చెప్పుకొచ్చారు. ఇర్కోడ్ తొక్కులు, మిట్టల్లి పప్పులు, కారం , పసుపు విక్రయ కేంద్ర నిర్వాహకులు లక్ష్మితో ముచ్చ టించారు.

వ్యాపారం ఎలా కొనసాగుతుందని ఆరా తీశారు. ఇర్కోడ్ తొక్కులు , మిట్టపల్లి పప్పులు హైదరాబాద్ మార్కెట్‌లో సైతం ఎగుమతి చేయాలని ఇందుకు సిపి శ్వేత కావల్సిన సహాయ సహకారాలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు వేలేటి రాదాకృష్ణశర్మ, మచ్చ వేణుగోపాల్ రె డ్డి,తదిరతులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News