- Advertisement -
సిద్ధిపేట : తెలంగాణ రాష్ట్ర సచివాలయంకు డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ నామకరణం చేసి గొప్ప దార్శనికతను సీఎం కేసీఆర్ చాటారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మహా మేధావికి మహోన్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి వెల్లడించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పాత బస్టాండు సర్కిల్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు సెక్రటేరియట్ కు అంబేద్కర్ నామకరణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -