తాండూరు : కృష్ణా జలాలు త్వరలోనే వికారాబాద్ జిల్లాతోపాటు తాండూరుకు తెస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తాండూరు శాసన సభ్యులు ఫైలెట్ రోహిత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా సిఎం కెసిఆర్ అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. అడ్వకేట్ల సంఘానికి రూ.100కోట్ల నిధి కేటాయించగా కరోనా సమయంలో సుమారు రూ. 25కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. భీమా సౌకర్యం ద్వారా రూ.11కోట్లు అందజేయడం జరిగిందన్నారు. వికారాబాద్ జిల్లాలో కూడా 100 మందికి నిధి ద్వారా సహాయం అందించిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. తాండూరులోనే రూ.36కోట్లతో మైనార్టీ బాలురు, బాలికల హాస్టల్ భవన నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.
ప్రపంచం అంతటా కూరాడయాయిల్ ధరలు తగ్గితే మన దేశంలో బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలు పెంచుతున్నదని ఆరోపించారు. పట్టభద్రుల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి ఓటర్ల వద్దకు వెళ్లి ఓటు వేసే విధంగా నచ్చజెప్పాలని అన్నారు. తాండూరు నియోజకవర్గంలో 50మంది ఓటర్లకు ఇద్దరు నాయకులను ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నియమించడం అభినందనీయమన్నారు. పదిరోజుల్లో నాయకులు, కార్యకర్తులు ప్రతి ఒక్కరు మూడు సార్లు ఓటర్లను కలిసి నచ్చజెప్పి ఓటు వేయించేవిధంగా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నేటి నుండే ఓటర్లను వాటప్స్ గ్రూపులు చేసి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు వారికి వివరిస్తూ ఓటు వేసుకునే మార్గం చూడాలన్నారు. రేపటి నుండి నేను నాతోపాటు మంత్రి వర్యులు సబితారెడ్డి, ఎంపి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పర్యావేక్షించడం జరుగుతుందన్నారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా సిఎం కెసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని అన్నారు. కరోనా సమయంలో ప్రయివేటు విద్యా వ్యవస్థ ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.
అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వివిధ పన్నుల్లో రాయితీ కల్పించడం జరిగిందన్నారు. పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. 5 లక్షల ఓటర్లలో సుమారుగా ఒక లక్షా 90వేల మహిళా ఓటర్లు అంతా కలిసి మాజీ ప్రధాని కూతురు ఎస్ వాణిదేవికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్ వాణిదేవి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా ఇంఛార్జీ నాగేందర్‌గౌడ్, కృష్ణమూర్తి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్వప్న పరిమల్, వైస్ ఛైర్మన్ దీపా నర్సింలు, ఎంపిపిలు బాలేశ్వర్‌గుప్తా, కరుణ, మార్కెట్ కమిటీ ఛైర్మన్‌లు విఠల్‌నాయక్, అరుణ, గాజీపూరు నారాయణరెడ్డి, కరణం పురుషోత్తంరావు, అబ్దుల్ రవూఫ్, శ్రీనివాస్‌చారి, నర్సింలు, మురళీగౌడ్, వెంకట్‌రెడ్డి, అప్పు, రాజన్‌గౌడ్, సంతోష్‌కుమార్, రాఘవేందర్, కౌన్సిలర్లు, తాండూరు, యాలాల, పెద్దేముల్ , బషీరాబాద్ మండలాల సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు, డాక్టర్లు, అడ్వకేట్లు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.