Sunday, December 22, 2024

షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కే రన్.. పాల్గొన్న మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాలలో ముందున్నట్లే.. తెలంగాణ మహిళలు సైతం ముందుండాలి. ఇందు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం ఉదయం షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కే రన్ కార్యక్రమాన్ని సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్, జిల్లా మేజిస్ట్రేట్ రఘురామ్, జెడ్పీ చైర్మన్ రోజాశర్మతో కలిసి 5కే రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 5కే రన్ కోసం వచ్చిన వారందరిలో ఉత్సాహం చూస్తే చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత షీ టీమ్స్ ద్వారా మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం అందరూ కలిసి కట్టుగా కృషి చేద్దామన్నారు. అందరూ ఆత్మ విశ్వాసంతో ముందుకు కదలాలని మంత్రి ఆకాంక్షించారు.

ఈ మేరకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో జరిగిన 5కే రన్ కార్యక్రమంలో స్త్రీల విభాగంలో బీ.ఇందు-తృతీయ-5వేలు, బీ.హారిక-ద్వితీయ-7500, కావ్య ప్రథమ రూ.10వేలు బహుమతి పొందారు.
పురుషుల విభాగంలో సి.హెచ్.ఎల్లం తృతీయ-5వేలు, జి.అభిషేక్-ద్వితీయ-7500, కే.అఖిల్ ప్రథమ రూ.10వేలు బహుమతి మంత్రి చేతుల మీదుగా పొందారు. చాలా అద్భుతంగా 5కే రన్ జరిగిందని, ప్రతి యేటా 5కే రన్ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ప్రతీ ఒక్కరూ యోగ, రన్నింగ్ మీ దినచర్యలో భాగంగా చేసుకోవాలని, ఫిజికల్, ఫిట్నెస్ పెంచుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బాలికల రెసిడెన్షియల్ స్కూల్స్, డిగ్రీ, పీజీ కళాశాలలు తెచ్చామని, ఏ రిజల్ట్స్ వచ్చినా మహిళలే టాపర్లుగా నిలుస్తున్నారని మంత్రి తెలిపారు.

పునరుద్ధరించిన సింథటిక్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభం

సిద్దిపేట క్రీడా మైదానంలో పునరుద్ధరించిన సింథటిక్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టును రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ మేరకు సిద్ధిపేట పోలీసు కమిషనర్ శ్వేత, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాలసాయిరాంతో కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడారు. షటిల్ బ్యాడ్మింటన్ లో ఫర్ ఫెక్ట్ షటిల్ కాక్ ఆడుతూ అక్కడి వారందరినీ అలరించారు. కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ మంజుల- రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ విజిత-వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News